Moviesటాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి స్టార్ లతో నటించిన తమన్నా.. ఫేవరెట్...

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి స్టార్ లతో నటించిన తమన్నా.. ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తమకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అందరి హీరోలతోనే నటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ హీరో అంటే మాకు ఇష్టం పదే పదే నటిస్తామంటే కుదరదు . కొన్నిసార్లు అలాంటి హీరోలతో మనకి ఛాన్స్ రాకపోవచ్చు . మరి కొన్నిసార్లు మనం వద్దు అనుకున్న హీరోలతో ఛాన్స్ రావచ్చు . అలాంటి సిచువేషన్స్ తమన్నా ఎన్నో ఫేస్ చేసింది అట. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తనకు ఇష్టం లేకపోయినా కొందరు హీరోలతో నటించాను అని ..ఇండస్ట్రీ అంటే అంతే అని అలాంటి పరిస్థితులు తప్పవు అంటూ చెప్పుకొచ్చింది”.

రీసెంట్గా సోషల్ మీడియాలో తమన్నా కి సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది. హీరోయిన్ తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది . చిరంజీవి – నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు – తారక్ – చరణ్ – ప్రభాస్ – రామ్ పోతినేని ఇలా అందరితోను స్క్రీన్ షేర్ చేసుకుంది . కానీ ఆమె తన ఫేవరెట్ హీరో ఎవరు అంటే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొస్తూ ఉంటుంది .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తమన్నాకి అంత ఇష్టమట . ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాకముందు నుంచి కూడా ఆయనను బాగా లైక్ చేసేదట . ఇండస్ట్రీ లోకి వచ్చాక ఆయనతో సినిమాలో నటించాలి అంటూ చాలా చాలా ఆశపడింది. ఫైనల్లి ఆమె ఇండస్ట్రీ లోకి వచ్చిన చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అందుకుంది . వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమా “కెమెరామెన్ గంగతో రాంబాబు”. వీళ్ళ కాంబో ని సెట్ చేసింది పూరి జగన్నాథ్ . ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. మరి ముఖ్యంగా తమన్న లోని మరో డిఫరెంట్ యాంగిల్ ను బయటపెట్టింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news