Moviesహవ్వ: రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ నిజంగానే ఆ తప్పు...

హవ్వ: రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ నిజంగానే ఆ తప్పు మాట అన్నాడా..? మెగా ఫ్యాన్స్ బూతులు..!!

ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. దేశంలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి . ఈ పెళ్లి వేడుకకు పలు పలువురు ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన స్టార్స్ అందరూ పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసనల జంట హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అంతేకాదు ఈ వేడుకకు బాలీవుడ్ సినీ తారగానం కదిలి వచ్చింది . మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ వేడుకకు హాజరై షాక్ ఇచ్చింది. కోటేశ్వరుడు తలచుకుంటే కొండమీద కోతి అయిన దిగివస్తుంది అంటారుగా ఆ రేంజ్ లో ప్రతి ఒక్కరిని ముఖేశ్ అంబానీ ఈ ఫంక్షన్ లో వాలేలా చేశారు . హాలీవుడ్ – బాలీవుడ్ – టాలీవుడ్ నటులు ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించారు. కాగా ఇదే క్రమంలో అమీర్ ఖాన్ – సల్మాన్ ఖాన్ – షారుక్ ఖాన్ స్టేజ్ పై డాన్స్ చేస్తూ ఉండగా మధ్యలో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ డాన్స్ చేయమని పిలవడానికి..” ఇడ్లీ సాంబార్ రారా డాన్స్ చేస్తూ “అని అన్నారట .

ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రాంచరణ్ ఎంత పెద్ద హీరోనో మనకు తెలిసిందే. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. అఫ్ కోర్స్ షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ఎంత క్లోజైనా అంతమంది ముందు ఇడ్లీ సాంబార్ అని పిలవడం అభిమానులకి హర్టింగా అనిపిస్తుంది . ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో రామ్ చరణ్ ఫాన్స్ షారుక్ ఖాన్ పై మండిపడుతున్నారు . అసలు నీకు బుద్ధుందా ..? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు . దీనిపై షారుఖ్ ఖాన్ వివరణ ఇస్తే తప్పిస్తే క్లారిటీ వచ్చే విధంగా లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news