Moviesకొత్త అవతారం ఎత్తబోతున్న జూనియర్ ఎన్టీఆర్ .. నందమూరి ఫ్యాన్స్ కు...

కొత్త అవతారం ఎత్తబోతున్న జూనియర్ ఎన్టీఆర్ .. నందమూరి ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చే న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో .. స్టార్ హీరోస్ కేవలం సినిమాల్లో నటించి మాత్రమే కాదు .. పలు యాడ్స్ ను ప్రమోట్ చేసి .. అలాగే కొన్నిసార్లు హోస్ట్ గా కూడా మారి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. కొందరు కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే హోస్ట్ గా అవతారం ఎతుత్తారు . మరికొందరు అభిమానులను పలకరించడానికి.. లైఫ్ లో ఒక కొత్త టర్న్ తీసుకోవడానికి ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు .

ఆ లిస్ట్ లోకి వస్తాడు మన ఎన్టీఆర్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాను సెట్స్ పై ఉండగానే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అదేవిధంగా ఎన్టీఆర్ హోస్ట్ గా కూడా ఓ షో చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రముఖ ఓటిటి సంస్థ ఒక టాక్ షోని కండక్ట్ చేయబోతున్నాడట .ఎన్టీఆర్ దీనికి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇది చాలా సరదా సరదాగా ఉండబోతుందట. నో కాంట్రవర్సీ ..నో వల్గారిటీ.. నో ఇష్యూస్ .. ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా చూసి ఎంజాయ్ చేసేటటువంటి షో అంటూ తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్తను బాగా ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు .

గతంలో తారక్ మీలో ఎవరు కోటీశ్వరుడు , బిగ్ బాస్ షోలను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే . చాలా టైం గ్యాప్ తర్వాత మళ్లీ ఇలా హోస్ట్ గా అవతారం ఎత్తబోతూ ఉండడంతో తారక్ పేరుని ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news