Moviesఇష్టం లేకపోయిన "ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆ పని చేశా.....

ఇష్టం లేకపోయిన “ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ఆ పని చేశా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు వైరల్..!!

ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అసలు ఆగిపోయింది అనుకున్న ఉస్తాత్ భగత్ సింగ్ సినిమా నుంచి పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్ అవ్వడం అభిమానులకి వెరీ వెరీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది . మనకు తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమానే ఈ ఉస్తాత్ భగత్ సింగ్ .

ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా మెల్లమెల్లగా కొనసాగుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం హరిష్ శంకర్ పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతో ఆయన మాట వినడం .. ఈ సినిమా ఆలస్యానికి కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే . రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాత్ భగత్ సింగ్ నుంచి పవర్ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ సినీ పరంగా ఎలా ఉందో కానీ పొలిటికల్ పరంగా మాత్రం రాడ్ గుచ్చి గుచ్చి దింపే రేంజ్ లో ఉన్నాయ్ డైలాగ్స్..

“గాజు గ్లాస్ గురించి చెబుతూ గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం..గ్లాస్ పగిలేకొద్ది పదును ఎక్కువ”.. అనే డైలాగ్స్ చాలా చాలా పవర్ ఫుల్ గా చెప్తాడు. ఇది చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది ఇది సినిమాలోని డైలాగ్ కాదు ఇది ఎవరికో ఘాటుగా తగిలేలా రాడ్ దించేలా చెప్పిన డైలాగ్స్ అని. అయితే జనరల్ గా పవన్ కళ్యాణ్ తన సినిమాలో పొలిటికల్ ఇష్యూస్ ని రాణించడానికి దానికి సంబంధించిన విషయాలను డిస్కస్ చేయడానికి ఇష్టపడడు .

కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఉస్తాత్ భగత్ సింగ్ సినిమాలో తనకి ఇష్టం లేకపోయినా సరే తన జనసేన పార్టీ గుర్తు గ్లాస్ గాజుపై డైలాగ్స్ ఉండేలా చేసుకున్నాడు. దానికి కారణం హరీష్ శంకర్. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పాడు. “ఉస్తాత్ భగత్ సింగ్ సినిమాలో ఆ డైలాగ్స్ నాకు చెప్పడం ఇష్టం లేదు ..కానీ హరీష్ శంకర్ పదే పదే అడిగితే కాదనలేక చెప్పాను” అంటూ ఓపెన్ గా చెప్పేసాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి . అంతేకాదు పవన్ కళ్యాణ్ తన సినిమాల విషయంలో ఇలా కూడా ఆలోచిస్తాడా..? ఏ మాటక ఆ మాట గ్లింప్స్ అదిరిపోయింది.. సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news