Moviesఆ పాడు అలవాటే డానియల్ జీవితాని నాశనం చేసేసిందా..? చిన్న ఏజ్...

ఆ పాడు అలవాటే డానియల్ జీవితాని నాశనం చేసేసిందా..? చిన్న ఏజ్ లోనే మరణించడానికి కారణం అదే..!

ఇది నిజంగా అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మరి ముఖ్యంగా చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ సెలబ్రెటీస్ గుండెపోటులకు గురవుతూ ఉండడం అభిమానులకు మింగుడు పడిన విషయం గానే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా అలాంటి ఓ వార్త ఇప్పుడు సినీ అభిమానులకు గుండెలు బద్దలైపోయేలా చేస్తుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న డానియల్ బాలాజీ గుండెనొప్పి కారణంగా మరణించారు. ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీని విషాదంలో నింపేసింది . డానియల్ బాలాజీ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉంటారు . పలు సినిమాలలో తనదైన స్టైల్ లో నటించి అభిమానులను సంపాదించుకున్న డానియల్ బాలాజీ చాలా చిన్న ఏజ్ లోనే గుండెపోటు కారణంగా మరణింరు .

రాత్రి చాతిలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడట డానియల్ బాలాజీ . ఈలోపే కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయినా సరే ప్రయోజనం లేకుండా పోయింది . హాస్పిటల్ కి తరలించే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు . డానియల్ బాలాజీ తమిళం తో పాటు తెలుగు – మలయాళం – కన్నడంలో కూడా 50కి పైగా సినిమాలు చేశాడు .

ఎక్కువగా విలన్స్ రోల్ లోనే మెప్పించాడు . చిట్టి అనే తమిళ్ సీరియల్ తో బాలాజీ యాక్టింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత పిన్ని పేరుతో తెలుగులో డబ్బింగ్ సీరియల్ బాగా పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఆరు సినిమాలకు పైగానే చేశాడు. ఎన్టీఆర్ – సాంబ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు డేనియల్ బాలాజీ . చాలా చిన్న ఏజ్ లోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు. డానియల్ బాలాజీ హఠాత్తు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం అలముకుంది . డేనియల్ బాలాజీ కు స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువగా అలవాటు ఉందట. ఆ కారణంగానే చిన్నతనంలోని హార్ట్ ఎటాక్ వచ్చింది అంటున్నారు కుటుంబ సభ్యులు – బంధుమిత్రులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news