Moviesతన కెరీర్ లో అనుష్క శెట్టి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా...

తన కెరీర్ లో అనుష్క శెట్టి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా ఏంటో తెలుసా..? మోస్ట్ మోస్ట్ స్పెషల్..!

అనుష్క శెట్టి.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అందానికి అందం.. నటనకి నటన.. ఫుల్ గా ఓ హీరొయిన్ కి ఉండాల్సిన లక్షణాలు ఉన్న అందాల ముద్దుగుమ్మ అని చెప్పాలి . ఇండస్ట్రీలో పలు సినిమాలో ఎక్స్ పోజ్ చేసిన సరే బయట మాత్రం చాలా పద్ధతిగా ఉంటుంది . అది అదే ఇది ఇదే అంటూ పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చింది . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన అనుష్క శెట్టి .. ఇప్పుడు సినిమాలు పెద్దగా చేయడం లేదు .

అరాకొరా చేస్తూ వస్తుంది . ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో బాగా నటించింది . మరి ముఖ్యంగా ఇప్పటికీ అనుష్కను జేజమ్మగా గుర్తించి పిలుస్తున్నారు అంటే కారణం అరుంధతి మూవీ అని చెప్పక తప్పదు . కాగా అనుష్క తన కెరీర్ లో ఎన్నో సినిమాల నటించింది . కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. మరి కొన్ని సినిమాల ఫ్లాప్ అయ్యాయి. అయితే ఆమె ఏనాడు కూడా డైరెక్షన్లో వేలు పెట్టలేదట .

కానీ ఒక సినిమా విషయంలో మాత్రం కొన్ని సీన్స్ ను తానే డైరెక్ట్ చేసుకుందట. ఆ సినిమా మరేదో కాదు భాగమతి . ఈ సినిమా అప్పట్లో 40 కోట్లకు పైగా షేర్స్ రాబట్టింది . ఈ సినిమాలో మెయిన్ లీడ్ అనుష్కనే. 80 శాతం సినిమాలో అనుష్కనే ఉంటుంది. అంతేకాదు కొన్ని సీన్స్ ఈ సినిమాలో అనుష్కనే డైరెక్ట్ చేసుకుందట . అనుష్క ఈ సినిమాలో గోడకు చేతిని పెట్టి చేతిపై శీల వేసే సన్నివేశాలు తానే డైరెక్ట్ చేసుకుందట . డైరెక్టర్ కూడా అనుష్క ధాట్స్ బాగుండటంతో ఆమెనె కొన్ని సీన్స్ డైరెక్ట్ చేయమన్నాడట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news