Moviesనాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాకి సీక్వెల్లో నటించబోతున్న నాగచైతన్య......

నాగార్జున కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాకి సీక్వెల్లో నటించబోతున్న నాగచైతన్య… జాక్ పాట్ హిట్ కొట్టాడు పో..!

నాగచైతన్య .. ఒక్కటంటే ఒక్క హిట్ లేక అల్లాడిపోతున్నారు . గతంలో ఆయన నటించిన సినిమాలు హిట్ అయ్యాయి. కానీ వందకోట్ల క్లబ్ లోకి చేర లేకపోయాడు. నాగచైతన్య వయసు ఉన్న హీరోలు అందరూ 100 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు కమిట్ అవుతూ పాన్ ఇండియా స్థాయిలోనే పాపులారిటీ దక్కించుకుంటున్నారు . అయితే నాగచైతన్య వర్షెన్ మాత్రం వేరేలా ఉంది. సింపుల్ బడ్జెట్ తో సింపుల్ కాన్సెప్ట్ తోనే అభిమానుల మనసును దో చేయాలి అని ట్రై చేస్తున్నారు .

విడాకుల తర్వాత పక్కాగా చెప్పాలంటే.. నాగచైతన్య ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. అంతేకాదు నాగచైతన్య ప్రజెంట్ తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో మరొక హీరోయిన్గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే చందు మొండేటి దర్శకత్వంలో సినిమా కంప్లీట్ అయ్యాక నాగచైతన్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తన నాన్న నాగార్జున కెరియర్ లోనే సూపర్ డూపర్ హిట్ గా ఎన్నో మైల్ స్టోన్స్ క్రియేట్ చేసిన మూవీగా నిలిచిన “నిన్నే పెళ్ళాడుతా” సినిమా సీక్వెల్లో నటించబోతున్నాడట . ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అని ఎప్పటినుంచో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . ఇన్నాళ్ళకి ఆ మూమెంట్ వచ్చినట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో నాగార్జున ఎంత రొమాంటిక్గా కనిపిస్తాడో మనకు తెలిసిందే. మరి ఇప్పుడు నాగచైతన్య అదే రేంజ్ లో కనిపిస్తే అక్కినేని అభిమానులకు పండగే మరి . ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. అంతేకాదు ఈ సినిమా ఖచ్చితంగా నాగార్జున కొడుకు నాగచైతన్యకు సూపర్ డూపర్ హిట్ ఇస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news