Moviesఅమ్మ బాబోయ్..పెళ్లి ఆయి 43ఏళ్లు అవుతున్నా.. ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్...

అమ్మ బాబోయ్..పెళ్లి ఆయి 43ఏళ్లు అవుతున్నా.. ప్రతి ఏడాది పెళ్లిరోజున రజినీకాంత్ దంపతులు ఇప్పటికి ఆ పని చేస్తారా..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా .. ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగారు ..ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో ముందుకు వెళుతున్నాడు. ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాకుండా పర్సనల్ లైఫ్ లోను తలైవా అనిపించుకున్నాడు. రజనీకాంత్ ఒక నటుడిగా సినిమా రంగంలో ఎంత నిబద్ధతతో నడిచాడో.. అదేవిధంగా ఒక భర్తగా కూడా తన జీవిత భాగస్వామితో అలాగే నడుస్తూ వచ్చారు.

26 ఫిబ్రవరి 1981లో రజనీకాంత్ – లతా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు . లతా కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి . సింగర్ గా.. ప్రొడ్యూసర్ గా.. కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేశారు . రీసెంట్గా వీళ్ళ జంట పెళ్లి చేసుకొని 43 ఏళ్లు కంప్లీట్ చేశారు . ఈ సందర్భంగా వాళ్ళ కూతురు సౌందర్య సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు . ఆ పోస్ట్ తో ప్రతి ఏడాది పెళ్లిరోజున రజనీకాంత్ దంపతులు ఏం చేస్తారో అందరికీ తెలియజేశారు.

సౌందర్య షేర్ చేసిన ఫోటోలో రజనీకాంత్ తన మెడలోని గోల్డ్ చైన్ చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ కనిపిస్తారు. అలాగే లతా ఆమె చేతిపై ఉన్న ఉంగరాన్ని చూపిస్తున్నారు. 43 ఏళ్ల కిందట పెళ్లి సమయంలో మార్చుకున్న ఉంగరాలు అవి . ప్రతి ఏడాది పెళ్లిరోజున వాటిని ధరించి రజినీకాంత్ దంపతులు పెళ్లి రోజును గుర్తు చేసుకుంటారట. సౌందర్య ఈ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నింది. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news