Moviesమెగా ఇంట మరో శుభకార్యం.. ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్న చిరంజీవి-చరణ్..ఎందుకంటే..?

మెగా ఇంట మరో శుభకార్యం.. ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్న చిరంజీవి-చరణ్..ఎందుకంటే..?

ఇది మెగా అభిమానులకి మరో గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీలో బ్యాక్ టు బ్యాక్ అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి . ఎప్పుడైతే రామ్ చరణ్ ఉపాసనలకు క్లింకార పుట్టిందో అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి కొత్త కళ వచ్చింది అంటున్నారు అభిమానులు . ఈ విషయాన్ని స్వయాన మెగాస్టార్ చిరంజీవి గారి కూడా ఒప్పుకున్నారు . మా ఫ్యామిలీకి క్లిం కార రాక ఎంతో శుభప్రదం అంటూ పలు ఇంటర్వ్యూలలో మాట్లాడారు .

అంతేకాదు అన్న విధంగానే క్లింకార పుట్టిన ముహూర్తం నుంచి ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో అన్ని మంచి రోజులే .. ఒకదాని తర్వాత ఒకటి మెగా ఫ్యామిలీ గౌరవం పై పైకి ఎదుగుతూ వెళ్తుంది . రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డు వరించిన విషయం తెలిసిందే . అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఈ అవార్డు అందుకున్న ఘనత చిరంజీవికే దక్కడం గమనార్హం.

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ మెగా ఫాన్స్ ఫుల్ సంబరాలు చేసుకుంటున్నారు . కాగా మెగాస్టార్ చిరంజీవికి సత్కారం చేస్తూ మెగా ఫ్యామిలీలోని హీరోలు ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఫంక్షన్ అరేంజ్ చేశారట . మెగాస్టార్ చిరంజీవికి – సురేఖకు ఈ ఫంక్షన్ లో సత్కారం చేయబోతున్నారట . పద్మ విభూషణ్ రావడం పట్ల చిరంజీవి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు . ఈ ఫంక్షన్ కి మూల కారణం చరణ్ – బన్నీ అంటూ తెలుస్తుంది . దీంతో ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news