Moviesవామ్మో.. అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ టోటల్ ఆస్తుల విలువ ఎన్ని వందల...

వామ్మో.. అమితాబ్ బచ్చన్-జయా బచ్చన్ టోటల్ ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా..? బాగానే మూటకట్టారే..!

సినిమా ఇండస్ట్రీలో బిగ్ బి అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అమితాబచ్చన్ . బాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతోమంది ప్రముఖులు ఏలేసిన ఇప్పటికీ ఏలుతున్న కూడా బాలీవుడ్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అమితాబచ్చనే. అలాంటి ఓ చెరగని స్థానాన్ని అభిమానుల మనసుల్లో సంపాదించుకున్నాడు . ఇప్పటికి పలు సినిమాలలో కీలకపాత్రను పోషిస్తూ .. తన నటనను కొనసాగిస్తున్న అమితాబచ్చన్ కి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అమితాబచ్చన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది .

పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. రెండు చేతుల బాగానే సంపాదిస్తూ వచ్చారు. కాగా బాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బి అమితాబచ్చన్ ఆస్తుల డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అంతేకాదు అమితాబచ్చన్ సతీమణి జయ బచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ నెట్ వర్త్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . సమాజ్ వాది పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ నుండి ఆమె రాజ్యసభకు ఐయిదవ సారి పోటీ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే అఫిడవిట్లో ఆమె తన వ్యక్తిగత సంపాదన వివరాలను నమోదు చేసింది . బ్యాంక్ బ్యాలెన్స్ 10.11 కోట్లు.. అమితాబచ్చన్ బ్యాంక్ బ్యాలెన్స్ 120 కోట్లు.. కేవలం బ్యాంకులో ఉండే సొమ్ము గానే ఇది అంటూ తెలుస్తుంది . అంతేకాదు జయాబచ్చన్ – అమితాబచ్చన్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఇతర ఇతర ఆస్తుల విలువలు మొత్తం 170 కోట్లకు ఉంటుంది అని తెలుస్తుంది . 2018లో వీరి ఆస్తి విలువ వెయ్యి కోట్లు . కాగా ఐదేళ్లలో 500 కోట్లు పెరిగింది అంటున్నారు . అమితాబచ్చన్ ఈ వయసులోనూ సినిమాలు చేస్తూ బ్రాండ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తున్నారు . ప్రజెంట్ వీళ్ళకి సంబంధించిన ఆస్తుల డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news