Moviesకేవ‌లం 5 రోజుల్లోనే ఎన్టీఆర్ గ‌జదొంగ సినిమా క్రియేట్ చేసిన ఆ...

కేవ‌లం 5 రోజుల్లోనే ఎన్టీఆర్ గ‌జదొంగ సినిమా క్రియేట్ చేసిన ఆ రికార్డ్ తెలుసా.. ఏ స్టార్ హీరోకు లేదు..!

టాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. అలాగే అందరికీ ఏదో ఒక రేర్ రికార్డ్ ఉంది. కొందరు హీరోలు వారి వారి పేర్ల మీద చాలా రికార్డులు క్రియేట్ చేసుకున్నారు. అలా ఎప్పటికీ చెరిగిపోని ఒక రికార్డు ఎన్టీఆర్ పేరు మీద నిలిచిపోయింది. ఎన్టీఆర్ పేరు చెపితే ఎన్నో రికార్డులు మన ముందు క‌ద‌లాడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన గజదొంగ ఓ అద్భుతం క్రియేట్ చేసింది.

అతి తక్కువ టైంలో పాటల షూటింగ్ జరుపుకున్న సినిమాగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఇలాంటి అరుదైన రికార్డు టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకు లేదు. గజదొంగ సినిమాలోని ఐదు పాటలు కేవలం ఐదు రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు. ఇలా చేయాలంటే ఈ తరం దర్శకలకు ఏమాత్రం సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క పాట షూటింగ్ చేయాలంటే వారం నుంచి పది రోజులు పడుతుంది. కొన్నిసార్లు ఒక్క పాట షూటింగ్ కి 20 రోజులు టైం పడుతుంది. గజదొంగ సినిమాలో ఐదు పాటలను దర్శకుడు రాఘవేంద్రరావు కేవలం ఐదు రోజులలో పూర్తి చేశారు.

ఎన్టీఆర్ ఏ సినిమాకైనా 30 రోజుల నుంచి కాల్ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేదే కాదు. ఎంత పెద్ద సినిమా అయినా ఆ లోపు పూర్తి చేసేయాలి. గజదొంగ విషయానికి వచ్చేసరికి అప్పటికి టాకీ పార్టు మాత్రమే పూర్తయింది. ఐదు పాటల షూటింగ్ బ్యాలెన్స్ అలాగే ఉండిపోయింది. ఆ టైంలో ఎన్టీఆర్ కి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కానీ ఆరు వారాలు ఖాళీగా ఉండి ఆ తర్వాత షూటింగ్ చేయాలంటే గజదొంగ సినిమాను మూడు నెలల పాటు వాయిదా వేయాల్సి ఉంది.

వెంటనే నిర్మాతలు వెళ్లి హీరో ఎన్టీఆర్‌ని అడగగా నాలుగు వారాలు మాత్రమే విశ్రాంతి తీసుకుని ఐదు రోజులు ఈ సినిమా కోసం కేటాయించారు. ఎన్టీఆర్ చేతికి నొప్పిగా ఉన్న సరే షూటింగ్ పెట్టుకున్నారు. కేవలం ఐదు రోజుల్లో ఐదు పాటల పూర్తి చేయాలంటే రాఘవేంద్రరావు ఎంత ప్లానింగ్ తో వ్యవహరించారో ..టెక్నీషియన్లు సపోర్టు ఎలా తీసుకున్నారో అర్థమవుతుంది. ఈ పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. అప్పట్లో గజదొంగ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇలాంటి అద్భుతం ఈ తరం హీరోలకు దర్శకులకు ఎంత మాత్రం సాధ్యం కాదని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news