Moviesపుష్ప2పై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్... పండగ చేసుకోండి...

పుష్ప2పై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్… పండగ చేసుకోండి రా అబ్బాయిలు…!!

పుష్ప2.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా . ఈ మూవీను సుకుమార్ తనదైన.. స్టైల్ లో తెరకెక్కిస్తున్నాడు . పుష్పవన్ సినిమాకి ఎక్కువే తెరకెక్కబోతుంది పుష్ప2 . ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . రష్మిక మందన్న హీరోయిన్గా కనిపించబోతుంది . అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి . సినిమా ఆగస్టు 15 రిలీజ్ చేస్తాము అంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు .

దానికి తగ్గట్టే షూట్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ దేవర సినిమా వాయిదా పడడంతో పుష్ప సినిమా కూడా వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. వీటిల్లో ఎటువంటి వాస్తవం లేదు అంటూ డైరెక్టర్ సుకుమార్ క్లారిటీ ఇచ్చారు . పుష్ప సినిమా రిలీజ్ తేదీలో ఎలాంటి మార్పు లేదని తేల్చేశారు. ఒకే ఒక్క పోస్టుతో అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించాడు .

“పుష్ప గాడి రూల్ బిగిన్ అయ్యేది ఇక 200 రోజుల్లోనే ..కాస్కోండి “అంటూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు . దీంతో వాయిదా అంటూ వచ్చిన రూమర్స్ ఫేక్ అంటూ తెలిసిపోయాయి . పుష్ప2 సినిమాపై మరింత హైప్స్ పెరిగిపోయాయి. కాగా ఈసినిమా ఐటెం సాంగ్ లో దిశా పటానీ నటించబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో పుష్ప 1 లో ఊ అంటావ మావ అంటూ సమంత ఇరగదీసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news