Moviesకఠినంగా ఉండే రాంగోపాల్ వర్మను.. ఏడిపించేలా చేసిన శ్రీదేవి ఫోటో ఏంటో...

కఠినంగా ఉండే రాంగోపాల్ వర్మను.. ఏడిపించేలా చేసిన శ్రీదేవి ఫోటో ఏంటో తెలుసా..? మనోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

రాంగోపాల్ వర్మ ఈ పేరు చెప్తే పూనకాల వచ్చే జనాలు కన్నా బిపి పెరిగిపోయే జనాలు ఒళ్ళు మండిపోయే జనాలు ఎక్కువ . అయితే కొంతమంది మాత్రం ఆర్జీవిని బాగా పొగిడేస్తూ ఉంటారు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అని.. ఆయనలా అందరూ ఉండలేరు అని .. ఆయన ఎంచుకున్న మార్గం సరైనదేనని ..ఆయన లైఫ్ ఆయన ఇష్టం .. ఆయన ఏమైనా చేయొచ్చు .. తన సంతోషం కోసం తను బతికేవాడే రియల్ మనిషి అని ..రాంగోపాల్ వర్మను పొగిడేస్తూ ఉంటారు .

కాగా సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవికి శ్రీదేవి అంటే చాలా చాలా ఇష్టం. ఈ విషయం ఆయనే చెప్పాడు. శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ . ఎన్నో వందల సార్లు ఆయన ఈ విషయం ఇంటర్వ్యూలలో బయటపెట్టాడు. ఆమెను హీరోయిన్ గా కాకుండా ఒక దేవతల ఆరాధించాడు . శ్రీదేవితో కలిసి ఆర్జీవి రెండు సినిమాలు తీశాడు . వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా ఉంది .

రీసెంట్గా ఆర్జీవి శ్రీదేవి గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు . ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఐ తో తయారు చేసిన శ్రీదేవి ఫోటోలు షేర్ చేసి ఈ ఫోటో నన్ను ఏడ్చేలా చేసింది అంటూ పోస్ట్ పెట్టాడు . శ్రీదేవి పై ఇంత ప్రేమ ఉందా రామ్ గోపాల్ వర్మ కి..?? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందరిని నువ్వు ఏడిపిస్తావు ..నిన్ను కూడా ఏడిపించేవాళ్లు ఉన్నారా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news