Moviesఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ - ఇంగ్లండ్ టెస్ట్‌... ' జై బాల‌య్యా...

ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్‌… ‘ జై బాల‌య్యా ‘ ఫీవ‌ర్ ఏం రేంజ్‌లో అంటే…!

ప్ర‌స్తుతం తెలుగు గ‌డ్డ మీద మాత్ర‌మే కాదు.. తెలుగు సినిమా ఆడుతోన్న ఏ థియేట‌ర్ల‌లో అయినా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ తెలుగు సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్నా అక్క‌డ జై బాల‌య్యా నినాదం పెద్ద స్లోగ‌న్ అయిపోయింది. ఏ హీరో అయినా.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. చిన్న హీరో అయినా.. చివ‌ర‌కు అది తెలుగులో డ‌బ్బింగ్ సినిమా అయినా… బాలీవుడ్‌, త‌మిళ డ‌బ్బింగ్ సినిమాలు అయినా ఆ థియేట‌ర్ల‌లో జై బాల‌య్య నినాదాలు మార్మోగాల్సిందే.

ప్ర‌స్తుతం జై బాల‌య్యా స్లోగ‌న్ ఆంధ్ర‌దేశాన్ని అంత‌లా ఊపేస్తోంది. ఇటు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య వెండితెర‌తో పాటు బుల్లితెర మీద ఎంత‌లా ఫామ్‌లో ఉన్నాడో చూస్తూనే ఉన్నాం. వెండితెర‌పై మూడు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ హిట్ల‌తో ఫుల్‌పామ్‌లో ఉన్నాడు. ఇటు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ టాక్ షో పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు. బాల‌య్య ఎవ‌రితో ఎపిసోడ్ చేసినా మామూలుగా పేల‌డం లేదు.

అన‌కాప‌ల్లి నుంచి అమెరికా.. లండ‌న్ వ‌ర‌కు జై బాల‌య్యా నినాదాలే వినిపిస్తున్నాయ్‌.. క‌నిపిస్తున్నాయ్‌.. తాజాగా హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో భార‌త్ – ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ కూడా జై బాల‌య్యా నినాదాలు ఆగ‌డం లేదు. ఇక్క‌డ కూడా కొంద‌రు మ్యాచ్ చూస్తోన్న అభిమానులు జై బాల‌య్యా.. జై బాల‌య్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌డంతో స్టేడియం కాసేపు జై బాల‌య్యా నినాదాల‌తో మార్మోగింది.

ఏదేమైనా జై బాల‌య్య స్లోగ‌న్ తెలుగునాట ఎంత బ‌లంగా పాతుకుపోయిందో చెప్పేందుకు మ‌రోసారి ఈ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. బాల‌య్య ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 109వ సినిమాలో న‌టిస్తోన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news