Moviesహమ్మయ్య.. ఫైనల్లీ కీర్తి సురేష్ ఆ విషయంలో మనసు మార్చేసుకుంది ..ఇంతకంటే...

హమ్మయ్య.. ఫైనల్లీ కీర్తి సురేష్ ఆ విషయంలో మనసు మార్చేసుకుంది ..ఇంతకంటే ఇంకేం కావాలి..!

కీర్తి సురేష్ ఇలా చెప్పడం కన్నా మహానటి అంటే జనాలు బాగా గుర్తుపడతారు . ఒకప్పుడు మహానటి అంటే సావిత్రి గారు గుర్తు వచ్చేవారు. ఇప్పుడు మహానటి అంటే ఈ జనరేషన్ కి గుర్తొచ్చేది కీర్తి సురేష్ . మహానటి అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో నటించిన అలాంటి హిట్ వేసుకోలేకపోయింది .

కీర్తి సురేష్ నటించిన సినిమాలు ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. దసరా సినిమా హిట్ అయినప్పటికీ భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోనే ఆమె తెలుగు సినిమాలలో ఇక నటించకూడదు అని డిసైడ్ అయింది అన్న వార్తలు వినిపించాయి . దానికి కారణం భోళా శంకర్ ఫ్లాప్ అయిన తర్వాత ఆమెను ఐరన్ లెగ్ అంటూ టాగ్ చేశారు . దాంతో బాగా హర్ట్ అయింది.

కీర్తి అందుకే బాలీవుడ్ కి చెక్కేసింది . ఇప్పుడు బాలీవుడ్లో ఆమె ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుంది . ఈ క్రమంలోనే ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమవుతుంది కీర్తి అని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అదంతా ఫేక్ కంటూ తెలుగు సినిమాకి సైన్ చేసింది కీర్తి సురేష్ . నాగార్జున కొడుకు నాగచైతన్య నటించిన తండెల్ సినిమాలో కీర్తి సురేష్ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మొదటి హీరోయిన్ గా ఈ సినిమాలో సాయి పల్లవి సెలెక్ట్ అయింది . ఇప్పుడు రెండో హీరోయిన్గా కీర్తి సురేష్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news