Moviesఛాన్సుల్లేక శ్రీలీల చివ‌ర‌కు ఆ పనికి కూడా ఓకే చెప్పేసిందా...!

ఛాన్సుల్లేక శ్రీలీల చివ‌ర‌కు ఆ పనికి కూడా ఓకే చెప్పేసిందా…!

సినిమా రంగంలో హీరోయిన్ల కెరీర్ నీటి బుడగ లాంటిది. ఇక్కడ సక్సెస్ చాలా ముఖ్యం.. ఆ సక్సెస్ సుదీర్ఘకాలం నిలబడేలా కెరీర్ కొనసాగించాలంటే మంచి కథలు ఎంచుకోవాలి.. లేకపోతే ఇలా వచ్చిన క్రేజ్ మరుక్షణమే అలా మాయం అయిపోతుంది. హీరోయిన్ శ్రీలీల పేరు టాలీవుడ్ గత ఏడాదికాలంగా బాగా వినిపించింది. పెళ్లిసందడి – ధమాకా – భగవంత్‌ కేసరి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. శ్రీలీలకు అసలు మరో మూడేళ్లు తిరుగే ఉండదని అందరూ అనుకున్నారు.

అయితే గత నాలుగు నెలల ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఆది కేశవ – ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ – స్కంద సినిమాలు వరుసగా వచ్చి ప్లాపులు అయ్యాయి. అయితే ఆమె మహేష్ బాబుకు జోడిగా నటించిన గుంటూరు కారం సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే తనకు రెండు మూడేళ్ల పాటు టాలీవుడ్ లో తిరుగే ఉండదు అనుకుంది. అనూహ్యంగా గుంటూరు కారం కూడా ప్లాప్‌ అయింది.

ఒకప్పుడు సూపర్ హిట్ అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ప్లాపులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. శ్రీలలపై టాలీవుడ్ ఐరన్ లెగ్ ముద్ర వేసేసింది. ఒకప్పుడు రోజుకు మూడు షిఫ్టుల‌ మీద పనిచేస్తూ బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు ఒక్కసారిగా ఖాళీ అయింది. స్టార్‌డం రుచి చూసిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు శ్రీలీల కూడా అదే బాధలో ఉందట. ఆమె స్టార్ డంకు తగిన అవకాశాలు రాక మరోవైపు క్రేజ్ కొనసాగించడం కోసం రోజుకో ఫోటోషూట్ చేస్తోంది ఈ క్రమంలోనే ఇండస్ట్రీ జనాలకు ఆమె కొన్ని సిగ్నల్స్ కూడా ఇచ్చేసిందట.

మొన్నటి వరకు పద్ధతి అయిన పాత్రను పోషించిన శ్రీలీల కాస్త బోల్డ్‌గా ఉండే పాత్రలైనా ఓకే అంటుందట. స్కిన్ షో చేయడానికి రెడీ అని.. అవసరమైతే లిప్‌లాక్‌ సన్నివేశాలలో కూడా నటిస్తానని చెబుతోందట. అయితే కాస్త పేరు ఉన్న హీరో సినిమా అయి ఉండాలని కండిషన్ పెడుతుందట. ఇటీవల ఆమెకు బోల్డ్‌ పాత్రలో నటించేందుకు ఆఫర్ వచ్చింది. ఆ హీరోకు అంత పేరు లేదు. దీంతో ఆమె నో చెప్పడంతో చేతికి వచ్చిన ఆ ఆఫర్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఏది ఏమైనా శ్రీలీల‌ లిప్ కిస్సులు, బోల్డ్ సీన్ల‌లో నటిస్తాన‌ని ఓకే చెప్పినా కూడా ఆమెకు అవకాశాలు రావడం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news