Moviesఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు నాని సినిమా రిజెక్ట్...

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు నాని సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్.. ప్రతిసారి ఆ పనికిమాలిన చెత్త రీజన్..!!

సినిమా ఇండస్ట్రీలో హీరో నాని కి చాలా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా మారాడు అంటూ చాలామంది జనాలు ఆయనను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు . అంతేకాదు అందరి హీరోలు లాగా ఒకటే టైప్ ఆఫ్ కథలను చూస్ చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ కధలని చూస్ చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు.

అయితే హీరోగా నాని కెరియర్ ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలిసిందే . కానీ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం నానితో సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు అవకాశం వచ్చినా మూడుసార్లు రిజెక్ట్ చేసిందట. మూడుసార్లు కూడా కాల్ షీట్స్ లేవు అన్న రీజన్ నే చెప్పి తప్పించుకునిందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన్నా. అప్పటివరకు ఫుల్ ఫ్లాప్స్ లో ఉన్న నాని కు “శ్యామ్ సింగరాయ్” సినిమా హిట్ ఇచ్చింది .

ఈ సినిమాలో కృతి శెట్టి పాత్ర కోసం ముందుగా రష్మికను అనుకున్నారట . అయితే ఆమె కాల్ షీట్స్ లేవు అంటూ తప్పించుకునిందట. అందుతున్న సమాచారం ప్రకారం నానితో లిప్ లాక్ చేయడం ఇష్టం లేక ఈ సినిమా నుంచి తప్పుకునిందట .. రెండవసారి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన దసరా సినిమాలో నటించాల్సింది .

అయితే నేచురల్ లుక్స్ లో అంతకుముందే పుష్ప లో నటించాను కదా అంటూ ఈ సినిమాను మిస్ చేసుకుందట . ఆ తర్వాత హాయ్ నాన్న లో నాని రష్మిక జంట బాగుంటుంది అంటూ డైరెక్టర్ ఈ కథను తీసుకెళ్లి ఆమెకు వివరించగా కాల్ షీట్స్ లేవు అంటూ తప్పించుకునిందట. దీంతో ముచ్చటగా మూడుసార్లు నానితో నటించే ఆఫర్ ని మిస్ చేసుకునింది రష్మిక . చూద్దాం ఈ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news