Newsచిరు, అమితాబ్‌, ఎన్టీఆర్‌తో క‌లిసి ర‌జ‌నీకాంత్ చేసిన మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఇవే..!

చిరు, అమితాబ్‌, ఎన్టీఆర్‌తో క‌లిసి ర‌జ‌నీకాంత్ చేసిన మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఇవే..!

కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈయన క్రేజ్ కేవలం తమిళ ఇండస్ట్రీకి పరిమితం కాదు దక్షణాదిలోనే ఎన్నో భాషలలో ఈయన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది ఇతర దేశాలలో కూడా ఈయన సినిమాలు విడుదల అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. రజనీకాంత్ కేంద్రం నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నారు. అయితే రజనీకాంత్ చేసినటువంటి ఇతర హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ గురించి విషయానికి వస్తే..

1). సీనియ‌ర్ ఎన్టీఆర్

సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి టైగర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ హీరోగా నటించారు.

2). మోహన్ బాబు:
మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. రజినీకాంత్ పాత్ర మోహన్ బాబు తండ్రి పాత్రలో నటించడం జరిగింది.

3) శోభన్ బాబు:
శోభన్ బాబు నటించిన జీవన పోరాటం సినిమాలో ఆయనతో కలిసి నటించారు.

4). సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఇద్దరు అసాధ్యులే వంటి సినిమాలలో రజనీకాంత్ నటించిన జరిగింది. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా రజనీకాంత్ కృష్ణ నటించారు.

5). చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలలో కాళీ, బందిపోటు సింహం, మా పిల్లై వంటి సినిమాలలో కలిసి ఇద్దరూ నటించడం జరిగిందట..

6). మోహన్లాల్:

రజనీకాంత్ మోహన్లాల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుచేలన్.. ఈ సినిమా తెలుగులో కథానాయకుడుగా తెరకెక్కించారు. ఇందులో టాలీవుడ్ నటులు నటించారు

7). సునీల్ శెట్టి:
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి దర్బార్ సినిమాల రజనీకాంత్ తో కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.

8). మమ్ముట్టి:
రజనీకాంత్ మమ్ముట్టి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దళపతి.. ఈ సినిమా రజినీకాంత్ కు బాగా పాపులారిటీ తెచ్చింది.

ఇక వేరే కాకుండా అమితాబచ్చన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ అనిల్ కపూర్ సన్నీ డియోల్, జగపతిబాబు, అర్జున్ తదితర హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news