Moviesసౌమ్య రావును అలా చేయమని టార్చర్ చేశారా..? అందుకే లక్షల రెమ్యూనరేషన్...

సౌమ్య రావును అలా చేయమని టార్చర్ చేశారా..? అందుకే లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చిన జబర్ధస్త్ ని వదిలేసిందా..?

జబర్దస్త్ ..ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది.. ఎన్నో కోట్ల మంది జనాలకు ఫేవరెట్ షోగా మారింది. అప్పటివరకు కేవలం డాన్స్ – పాటలు ఇలాంటి షోసే తెరపై చూసాం. కానీ ఫస్ట్ టైం కామెడీ షో ని తెరపైకి తీసుకొచ్చిన ఘనత జబర్దస్త్ కే దక్కింది. చాలా తెలివిగా జబర్దస్త్ షోని డిజైన్ చేసింది . పూర్తిగా కామెడీ పద్ధతిలో ముందుకెళ్లిన ఈ జబర్దస్త్ షో రాను రాను ఇప్పుడు వల్గర్ గా తయారవుతుంది .

అయితే జబర్దస్త్ షో స్టార్టింగ్ మాత్రం చాలా చాలా మంచిగా నవ్వించింది. రకరకాల స్కిట్స్ తో జాబ్స్ చేసుకుని టెన్షన్స్ తో ఇంటికి వచ్చిన వాళ్లకు మంచి రిలాక్స్ ఇచ్చింది . అప్పట్లో జబర్దస్త్ షో చూడందే ఎవరు నిద్రపోయేవారు కారు అని చెప్పడంలో సందేహం లేదు . జబర్దస్త్ ఆ తర్వాత మెల్ల మెల్లగా హద్దులు మీరుతూ వచ్చింది . రీసెంట్గా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. జబర్దస్త్ లో యాంకర్ గా ఉండే సౌమ్యరావును కావాలని షో నుంచి తప్పించారు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

రష్మి – అనసూయ తర్వాత జబర్దస్త్ షోకు సౌమ్యరావు యాంకరింగ్ చేసింది . అయితే చాలా తక్కువ టైంలోనే ఆమె జబర్దస్త్ నుండి తప్పుకుంది . దానికి కారణం ఆమెకు ఇష్టం లేకపోయినా సరే కొన్ని రకాల బట్టలు వేసుకోమని ఫోర్స్ చేస్తున్నారట. ఆమెపై వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారట. అంతేకాదు కొన్ని సార్లు అవి తమ ఫ్యామిలీని కూడా హర్ట్ చేస్తాయి అని ..అలా వేయొద్దు అని చెప్పినా కూడా కమెడియన్స్ వినట్లేదట . దీంతో ఓపిగ్గా చూసిన సౌమ్యరావు.. ఫైనల్ గా తప్పుకుంటున్నాను అంటూ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసి మరి షో నుంచి తప్పుకున్నేసిందట. గతంలో యాంకర్ అనసూయ కూడా ఇదే కారణంగా షో నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news