Movies' స‌లార్ ' టాక్ ఇది... RRR ఆల్‌ రికార్డులు ఉఫ్‌.....

‘ స‌లార్ ‘ టాక్ ఇది… RRR ఆల్‌ రికార్డులు ఉఫ్‌.. ఉఫ్‌

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కు ఆ రేంజ్‌కు త‌గ్గ హిట్ రాలేదు. సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్ మూడూ పాన్ ఇండియా అంటూ హ‌డావిడిగా వ‌చ్చి బొక్క‌బోర్లా ప‌డ్డాయి. సాహో నార్త్ వ‌ర‌కు హిట్ అయ్యింది. అయితే తాజాగా కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన మ‌న తెలుగోడు, క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ – ప్ర‌భాస్ కాంబినేష‌న్లో స‌లార్ సినిమా రావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. ఆకాశాన్నంటే అంచ‌నాల‌తో ఈ రోజు థియేట‌ర్ల‌లోకి దిగిన స‌లార్‌కు అర్ధ‌రాత్రి షోల నుంచే అదిరిపోయే టాక్ వ‌చ్చేసింది.

స‌లార్ మానియా మామూలుగా లేదు. సినిమా చూసిన ప్రేక్ష‌కులు స‌లార్ పూన‌కాల‌తో ఊగిపోతున్నారు. సోష‌ల్ మీడియా అంతా ఫుల్ పాజిటివ్ కామెంట్ల‌తో షేక్ అవుతోంది. బాహుబలి త‌ర్వాత ప్ర‌భాస్ సాలీడ్ కం బ్యాక్ ఇచ్చాడ‌ని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ప్ర‌భాస్‌కు ఇది అస‌లు సిస‌లు మాసీవ్ హిట్ అంటున్నారు. క‌న్న‌డ జ‌నాలు మాత్రం మా ప్ర‌శాంత్ నీల్ మొత్తానికి గ‌ట్టిగానే కొట్టాడంటున్నారు.

ప్ర‌భాస్ మంట‌లు పుట్టించేశాడంటున్నారు. మొత్తానికి ఈ యేడాది ఎండింగ్‌లో అస‌లు సిస‌లు బ్లాక్బ‌స్ట‌ర్‌తో ఇండియ‌న్ సినిమాకు స‌రైన సినిమా ప‌డింద‌ని అంద‌రూ హ్యాపీగా ఉన్నారు. ప్ర‌భాస్‌తో పాటు పృథ్విరాజ్ న‌ట‌న‌కు జ‌నాలు ఫిదా అవుతున్నారు. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌పై ఆకాశామే హ‌ద్దుగా కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌భాస్‌ను ఇంత కంటే గొప్ప ఎలివేష‌న్ల‌తో ఎవ్వ‌రూ చూపించ‌లేర‌ని అంటున్నారు.

ఆంధ్రా, తెలంగాణ‌, బెంగ‌ళూరు మాత్ర‌మే కాదు.. ఓవ‌ర్సీస్‌లోనూ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కాదు.. దాన‌మ్మ మొగుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అస‌లు స‌లార్ మానియాలో డంకీ, ఆక్వామెన్ సినిమాలు ఏ మాత్రం నిల‌బ‌డేలా లేవు. అంత విధ్వంస‌మైన టాక్ స‌లార్‌కు వ‌చ్చేసింది. ఇక రు. 1000 + కోట్లు లోడింగ్.. ఆర్ ఆర్ రికార్డులు ఉఫ్‌ అన్న ర‌చ్చ కూడా సోష‌ల్ మీడియాలో మొద‌లైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news