Moviesర‌జ‌నీకాంత్‌, విజ‌య్ రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించేసిన ప్ర‌భాస్‌... ఆల్ టైం సింగిల్...

ర‌జ‌నీకాంత్‌, విజ‌య్ రికార్డుల‌కు చెద‌లు ప‌ట్టించేసిన ప్ర‌భాస్‌… ఆల్ టైం సింగిల్ హీరో…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ సినిమా సలార్. ఈనెల 22న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డైనోసార్‌గా గర్జించింది. ఇప్పటికే ఎన్నో సూపర్ డూపర్ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సలార్.. ప్రభాస్ కెరీర్‌లో మరో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఏ హీరోకు లేని అరుదైన రికార్డ్‌ ప్రభాస్ ఖాతాలో వేసింది.

ప్రభాస్ నటించిన ఐదు సినిమాలు రు. 300 కోట్ల రూపాయల మార్కును దాటాయి. సౌత్ లో ఇప్పటివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన నాలుగు సినిమాలు మూడు వందల కోట్లు క్రాస్ చేశాయి. అలాగే సౌత్ లో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన పలు సినిమా రికార్డులను కూడా సలార్ సినిమాతో ప్రభాస్ చెరిపేసాడు. సౌత్ ఇండియాలో రూ.300 కోట్ల సినిమాలు ఐదు కలిగిన ఏకైక హీరోగా ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డు సెట్ చేశాడు.

ఇక ఈ సినిమా మంచినీళ్లు తాగినంత సులువుగా రూ.500 కోట్ల రూపాయల క్లబ్లో చేరిపోతోంది. లాంగ్‌ర‌న్‌లో కేజిఎఫ్ 2 రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్‌కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. పృధ్విరాజ్ సుకుమారన్‌, జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలలో

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news