Newsసితార ను ఆయన డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్న మహేశ్...

సితార ను ఆయన డైరెక్షన్ లో ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్న మహేశ్ బాబు.. మరో జాతియ అవార్డ్ పక్క..!

మహేష్ బాబు కూతురు సితార ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంత హై రేంజ్ లో దూసుకుపోతుందో మనం చూస్తున్నాం . స్టార్ హీరోయిన్ లకి మించిన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్న సితార ఘట్టమనేని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి ట్రై చేస్తుంది. అయితే ఇప్పుడే కాదు చదువు పూర్తి అయిపోయిన తర్వాత తనను ఇండస్ట్రీలోకి హీరోయిన్గా దింపుతామంటూ ఘట్టమనేని మహేష్ బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు .

తన ఇష్టా ఇష్టాలను మేము ఏనాడు కాదు అనము అంటూ క్లారిటీ ఇచ్చాడు . అయితే ఒకవేళ మహేష్ బాబు తన కూతురు సితార ఘట్టమనేనిని .ఏ డైరెక్టర్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాడు అన్న ప్రశ్న ఆయనకు ఎదురైతే ఖచ్చితంగా ఆప్షన్లో ఇద్దరే ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . ఒకటి రాఘవేంద్రరావు గారు రెండోది సుకుమార్. వీళ్లిద్దరి దర్శకత్వంలోనే తన కూతురుని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయాలి అని మహేష్ బాబు బలంగా ఫిక్స్ అయ్యారట.

దానికి కారణం వీళ్ల సినిమాలో హీరోయిన్స్ క్యారెక్టర్స్ నాచురల్ గా ఉండడం .. హీరోయిన్స్ ఇంకా చక్కగా అందంగా చూపించడం . కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా కథ విషయంలో కూడా హీరోయిన్స్ కు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటమే కారణమంటూ తెలుస్తుంది. రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో సీతార ఘట్టమనేని ఎంట్రీ ఇస్తే జనాలు ఓల్డ్ సినిమాలను గుర్తు చేసుకుంటారు. అదే సుకుమార్ సినిమాలో సీతార ఘట్టమనేని ఎంట్రీ ఇస్తే మాత్రం ఓ రంగస్థలం ఓ పుష్ప లాంటి సినిమాలను గుర్తు చేసుకుంటారు. అందుకే సుకుమార్ కే ఎక్కువ మంది ఓటు వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news