Newsహీరోయిన్ శ్రీయ లేటెస్ట్ ఫొటో వైర‌ల్‌... చాలా స్పెషాలిటీ ఉంది (...

హీరోయిన్ శ్రీయ లేటెస్ట్ ఫొటో వైర‌ల్‌… చాలా స్పెషాలిటీ ఉంది ( ఫొటో)

సీనియ‌ర్ హీరోయిన్‌, ముదురు ముద్దుగుమ్మ శ్రీయ గురించి తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. శ్రీయ 2000లో ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన ఇష్టం సినిమాతో తెలుగు తెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి ఆమె వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. తెలుగులో అంద‌రూ స్టార్ హీరోల‌తో న‌టించి ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టింది. అటు త‌మిళంతో పాటు క‌న్న‌డ‌, బాలీవుడ్‌లోనూ సినిమాల్లో న‌టించింది.

దాదాపు ద‌శాబ్దంన్న‌ర పాటు ఆమెకు టాలీవుడ్‌లో ఎదురు లేకుండా పోయింది. బాల‌య్య‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి హీరోల‌తో పాటు ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ లాంటి కుర్ర హీరోల సినిమాల్లోనూ న‌టించింది. ప‌విత్ర లాంటి ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లోనూ న‌టించింది. న‌టిగా మంచి బిజీగా ఉన్న టైంలోనే శ్రీయ ర‌ష్యాకు చెందిన భాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకుంది.

పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సినిమాల్లో న‌టిస్తూనే వ‌స్తోంది. ఈ దంప‌తుల‌కు ఒక కుమార్తె పుట్ట‌గా.. ఆ పాప‌కు రాధ అని పేరు పెట్టారు. ఈ యేడాది శ్రీయ క‌న్న‌డ సినిమా క‌బ్జాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ వ‌య‌స్సులోనూ హాట్‌నెస్‌గా క‌నిపించ‌డంతో పాటు సినిమా ఛాన్సుల కోసం ఆమె హాట్ హ‌ట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.

శ్రీయ తాజాగా ఓ స్పెష‌ల్ ఫొటో సెష‌న్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఫొటో సెష‌న్‌కు ఆమె మూడేళ్ల కూతురు హెల్ఫ్ చేయ‌డం ఇక్క‌డ విచిత్రం. త‌న త‌ల్లి కోసం ఈ మూడేళ్ల పాప అద్దం చూపిస్తుండ‌డంతో శ్రీయ ఆ స్టిల్ చూసి ఆనందంతో ప‌ర‌వ‌శిస్తోంది. చిన్న వ‌య‌స్సులోనే త‌న త‌ల్లికి సాయం చేస్తోన్న ఆ చిన్నారిని చూసి నెటిజ‌న్లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news