News"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" ఖచ్చితంగా ధియేటర్ లోనే చూడాలి...

“ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” ఖచ్చితంగా ధియేటర్ లోనే చూడాలి అని చెప్పడానికి 3 కారణాలు ఇవే.. డోంట్ మిస్ బ్రదర్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న నితిన్ తాజాగా నటించిన సినిమా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. ఎలాగైనా హిట్ అవ్వాలి అని ఫాన్స్ కూడా కోరుకున్నారు . అంతేకాదు నితిన్ కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి చాలా చాలా కష్టపడ్డాడు . తనలోని కామెడీ స్కిల్స్ ను బయటకు తీసుకొచ్చి స్టార్ స్టేటస్ పక్కన పెట్టి డైరెక్టర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా డైలాగ్స్ చెప్పుకొచ్చారు .

అందుకే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి బిగ్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. అంతేకాదు థియేటర్ నుంచి బయటికి వచ్చే జనాలు ప్రతి ఒక్కరు కూడా సినిమాకి సంబంధించి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు .. తప్పిస్తే ఎక్కడ నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం లేదు. మరీ ముఖ్యంగా ఎందుకు ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అన్న విషయం పై మూడు పాయింట్స్ లు చెప్పుకొస్తున్నారు అభిమానులు .

  • ఒకటి ఈ మధ్యకాలంలో కామెడీ టైప్ జోనర్ సినిమాలు రాలేదు లవ్ – రొమాంటిక్ – సస్పెన్స్ – యాక్షన్ ధ్రిల్లర్ సినిమాలే వచ్చాయి . మనం కడుపుబ్బ థియేటర్లో ఓ నవ్వుకునే సినిమా చూసి కొన్ని సంవత్సరాలు అవుతుంది . కచ్చితంగా ఇప్పుడున్న ప్రెజర్ కి టెన్షన్ కి రిలాక్సేషన్ కోసం ఇలాంటి సినిమాలు అవసరం . థియేటర్ కి వెళ్లి ఫ్యామిలీ అంతా కలిసి చూసి కడుపుబ్బ నవ్వుకునే కామెడీ టైమింగ్స్ ఈ సినిమాలో బోలెడు ఉన్నాయి .
  • రెండవది వల్గారిటీ ఎక్కడా లేదు. సినిమాలో ఈ మధ్యకాలంలో బట్టలు విప్పడం ముద్దులు పెట్టడం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే వక్కంతం వంశీ మాత్రం క్లీన్ గా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా సీన్స్ రాసుకున్నాడు .

*మూడవది నితిన్ పర్ఫామెన్స్ థియేటర్స్ లో చూస్తేనే మజా వస్తుంది ..అన్ని వందలమంది జనాల మధ్యలో గట్టిగ నవ్వుతూ చప్పట్లతో అరుపులతో కేరింతలతో ఆ కామెడి టైమింగ్స్ చూస్తే కచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా థియేటర్కు వెళ్లి చూడాల్సిందే అటువంటి సినిమా అని ప్రమోట్ చేస్తున్నారు నితిన్ అభిమానులు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news