Moviesడెవిల్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇంత దారుణంగా ఉన్నాయి ఏంటి.. కళ్యాణ్...

డెవిల్ ఫస్ట్ డే కలెక్షన్స్: ఇంత దారుణంగా ఉన్నాయి ఏంటి.. కళ్యాణ్ రామ్ కి ఊహించని షాక్..!

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా హీరోగా నటించిన సినిమా డెవిల్ . ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించింది . ఫుల్ టు ఫుల్ పిరియాడిక్ యాక్షన్ డ్రామగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది . మరి ముఖ్యంగా ఇలాంటి కథలు ఈ మధ్యకాలంలో రాకపోవడం ఒక ప్లస్ అయితే నందమూరి కళ్యాణ్ రామ్ నటన ఈ సినిమాకి మరింత ప్లస్ గా మారింది .

కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా మాత్రం అభిమానులను నిరాశపరిచింది. కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నైజాంలో 5.50 కోట్లు ..సీడెడ్ లో మూడు కోట్లు.. ఆంధ్రాలో 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలలో 16 కోట్ల బిజినెస్ చేసుకుంది .

అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒక కోటి 50 లక్షలు బిజినెస్ చేసింది. అయితే నందమూరి కళ్యాణ్రామ్ నటించిన డెవిల్ మూవీకి మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు కోట్ల వరకు షేర్ వసూలు అయినట్లు తెలుస్తుంది . వరల్డ్ వైడ్ గా 2.60 కోట్ల వరకు షేర్ వచ్చిందట . దీనిపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. బింబిసారా తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ నే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news