Newsఏపీ, తెలంగాణ ' స‌లార్ ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్లు... ప్ర‌భాస్...

ఏపీ, తెలంగాణ ‘ స‌లార్ ‘ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్లు… ప్ర‌భాస్ రాజు ఫామ్‌లోకొస్తే ప‌గిలిపోద్ది…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో ప్రశాంత్ నీల్‌ పేరు దేశవ్యాప్తంగా ఎలా మారుమోగిపోతుందో చూస్తూనే ఉన్నాం. తాజాగా సలార్ ఈనెల 22న థియేటర్లలో రిలీజ్ అయ్యి భారతీయ సినీ ప్రేక్షకులను, ప్రభాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా వారం రోజులు పూర్తి చేసుకున్న సలార్ రూ.500 కోట్ల వసూళ్లు దాటేసింది.

అటు ఓవర్సీస్ లోను ఎనిమిది మిలియ‌న్‌ డాలర్లు దాటేసి 10 మిలియన్ డాలర్ల వైపు పరుగులు పెడుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో సలార్ మొదటి వారం రోజులు బాక్సాఫీస్ దగ్గర విధ్వంశం క్రియేట్ చేసిందని చెప్పాలి. ఏపీ, తెలంగాణలో సలార్‌కు మామూలు కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా తొలి వారం రోజులు ఏపీ, తెలంగాణలో ఏకంగా రూ.128 కోట్ల షేర్ రాబట్టింది. ఈ ఏడాది ఏ సినిమాకైనా ఇదే అత్యధికం అని చెప్పాలి.

ప్రభాస్ రాజు ఫామ్ లోకి వస్తే తెలుగు గడ్డ ఎలా అదిరిపడుతుందో.. ఒక్కొక్కడికి ఏ రేంజ్ లో వార్నింగ్ ఉంటుందో చెప్పేందుకు ఈ కలెక్షన్ లే నిదర్శనం. ఏది ఏమైనా సలార్ లాంగ్ ర‌న్‌లో మరిన్ని వసూళ్లు సాధించడం.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై క‌న్న‌డ నిర్మాత విజ‌య‌కిరంగ‌దూర్ నిర్మించిన ఈ సినిమాకు రవి బసౄర్ సంగీతాన్ని అందించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్ సుకుమార‌న్‌, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news