News2 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణ ' అఖండ ' .....

2 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణ ‘ అఖండ ‘ .. సెన్సేషనల్ రికార్డులు ఇవే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ రెండు పాత్రలలో.. ఊరమాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిలిం అఖండ. ఈ సినిమా ఈ డిసెంబర్ 2వ‌ తేదీ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2021 డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. సీనియర్ నటులు జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలలో నటించారు. థ‌మన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మూడు వ‌రుస డిజాస్టర్ ల తర్వాత.. బాలయ్య పని పూర్తిగా అయిపోయింది అన్న విమర్శలు తర్వాత.. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమాగా వచ్చిన అఖండ బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్ చేసింది.

ఈ మూవీ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్‌ హిట్ సినిమాగా నిలిచింది. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఒక సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవటం చాలా గ్రేట్. అలాంటిది అఖండ 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు, 175, 200 రోజులు పాటు ఆడింది. అసలు ఇలాంటి పోస్టర్లు గత పదిహేళ్లుగా టాలీవుడ్ లో కనిపించలేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్లలో వంద రోజులు ఆడింది అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకునే వాళ్ళు. అలాంటి రోజులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అయితే అఖండ 200 రోజులు పాటు ఆడి.. సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసింది.

ఆఖండ 103 థియేటర్లలో 50 రోజులు ప్రదర్శించబడటం ఒక రికార్డు అని చెప్పాలి. ఆ తర్వాత డైరెక్ట్ గా నాలుగు కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ సినిమా షిఫ్టులతో కలుపుకుని 20 థియేటర్లలో వంద రోజులు పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లాలోని.. చిలకలూరిపేటలోని.. రామకృష్ణ థియేటర్లో 175 రోజులు పడడంతో పాటు ఆ తర్వాత 200 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఒక కర్నూలు జిల్లాలోని.. ఆదోని, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల‌ సెంటర్లలో మూడు కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇలాంటి అరుదైన రికార్డు కేవలం బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైందని చెప్పాలి.

అలాగే బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాల తర్వాత అఖండ వరుసగా మూడో సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా లెజెండ్. అయితే కడప, కర్నూలు జిల్లా సెంటర్స్ లో 400 రోజులకు పైగా ఆడింది. కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో 1000 రోజులకు పైగా ప్రదర్శించబడి సౌత్ సినీ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అయితే బాలయ్య నటించిన 11 సినిమాలు డైరెక్ట్ గా నాలుగు షోలతో 100 రోజులకు పైగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. టాలీవుడ్ లో ఏ హీరోకు ఇలాంటి అరుదైన రికార్డు లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news