Newsఆ ఒక్క పని చేయకుండా ఉంటే పాయల్ చేతి నుండి మంగళవారం...

ఆ ఒక్క పని చేయకుండా ఉంటే పాయల్ చేతి నుండి మంగళవారం మిస్ అయ్యేదా..? లక్ కప్పలా అత్తుకునేసిందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ తాజాగా నటించిన సినిమా మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అందుకుంది. కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వీళ్ళిద్దరి కాంబోలో మొదట ఆర్ఎక్స్ 100 అనే సినిమా వచ్చింది .

ఈ సినిమా కూడా బాగా సక్సెస్ అందుకుంది . ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి అలాగే పాయల్ రాజ్ పుత్ అందుకున్న దాఖలాలే లేవు. కాగా వీళ్ళ కాంబోలో వచ్చిన సెకండ్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా అలాగే అభిమానులను ఆకట్టుకుంది . అయితే ఈ సినిమా కథను పాయల్ రాజ్ పుత్ కి వివరించగా.. ఆమె ఈ సినిమా కోసం తాను చేయించుకోవాలి అనుకున్నా ఆపరేషన్ ని వాయిదా వేయించుకుందట .

ఆ కారణంగానే ఈ సినిమా ఆమె చేతికి వచ్చింది . ఒకవేళ పాయల్ రాజ్ పుత్ ఎమర్జెన్సీ కండిషన్ మీద తనకు హెల్త్ బాగోలేని కారణంగా అలాంటి ఆపరేషన్ చేయించుకొని ఉంటే.. ఇప్పుడు ఆమె చేతికి ఈ అవకాశం వచ్చేది కాదు . అలా మంగళవారం సినిమా పాయల్ చేతిలోకి వచ్చి హిట్ అయింది. ఈ సినిమా ఆమె కెరీర్ లోనే బిగ్గేస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news