News' పొలిమేర 2 ' డే > 2 డే...

‘ పొలిమేర 2 ‘ డే > 2 డే 1… మైండ్ బెండింగ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ రా ఇది…!

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ సత్యం రాజేష్ హీరోగా దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమా పొలిమేర 2. దీనికి ముందు వచ్చిన పార్ట్ వన్ కూడా పార్ట్ 2 పై మరింత హైప్ తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ అంచనాలు రీచ్ అవుతూ పొలిమేర 2 కూడా సాలిడ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో తెలుగు సినిమా లవర్స్ పొలిమేర 2 సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సినిమాకు పోటీగా వచ్చిన త‌రుణ్ భాస్క‌ర్ కీడా కోలా సినిమాకు కూడా హిట్ టాక్ వ‌చ్చింది. అయినా కూడా పొలిమేర 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా కంటే అనూహ్యంగా ఎక్కువ వసూళ్లు రాబడుతోంది. విచిత్రం మొదట రోజు కంటే రెండో రోజు మాస్ బుకింగ్స్ అదిరిపోయాయి. అటు బుక్ మై షో లోను.. ఈ సినిమా అదరగొడుతుంది.

రెండు రోజుల్లో ఈ సినిమా రూ.6.6 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు అందుకుని భారీ హిట్ దిశగా దూసుకు వెళుతుంది. ఇక మూడో రోజు అయిన ఆదివారం కూడా ఈ సినిమా నెక్ట్స్‌ లెవెల్ జంప్ తీసుకొని మరింత ఎక్కువ వసూళ్లు అందుకున్న‌ట్లు టాలీవుడ్‌ సర్కిల్స్ లో టాక్ మొదలైంది. ఏది ఏమైనా పొలిమేర 2 బాక్సాఫీస్ దగ్గర తన రేంజ్‌కి మించిన సూపర్ హిట్ దిశ‌గా దూసుకుపోతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news