News"అనుష్క బాహుబలి చేసింది కేవలం దాని కోసమే..నా కధ నచ్చి కాదు"...

“అనుష్క బాహుబలి చేసింది కేవలం దాని కోసమే..నా కధ నచ్చి కాదు” ..టాప్ సీక్రేట్ రివీల్ చేసిన జక్కన్న..!

బాహుబలి.. ఈ సినిమా పేరు చెబుతూ ఉంటేనే మనకు తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. కళ్ళు మూసుకొని ఈ పేరు తలుచుకున్న మనకు తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది . అలాంటి ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన సినిమా ఇది . ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ..ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసింది బాహుబలి .

ఇప్పుడు రాజమౌళి ఒక హీరోకి తీసుకున్నంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అంటే దానికి కారణం బాహుబలి. ఆయన కెరియర్ లో ఎన్నో సినిమాలు ఉండొచ్చు కానీ అన్నిటికన్నా ది బెస్ట్ సినిమా ఏది అంటే అందరూ చెప్పే బాహుబలి. ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క తమన్నాల నటించారు. అయితే తమన్న పాత్ర బిస్కెట్.. పెద్దగా వాల్యూ ఉండదు. సినిమా మొత్తానికి అనుష్క పాత్ర హైలెట్ అవుతుంది .

అయితే ఈ సినిమా కథను రాజమౌళి అనుష్కకు చెప్పినప్పుడు ఆమె సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చేసిందట . రెమ్యూనరేషన్ కూడా అస్సలు అడగలేదట . ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు రాజమౌళి . “అనుష్క సినిమా చేసింది నాకోసం ..నా కథ నచ్చి కాదని ప్రభాస్, శ్రీవల్లి, రమా అందరూ తనకు మంచి ఫ్రెండ్స్ అని వీళ్ళందరూ సినిమా షూట్ లో బాగా ఎంజాయ్ చేస్తే ..నేను ఒక్కదాన్నే దూరంగా ఉండి ఏం చేయాలి అన్న ఉద్దేశంతోనే సినిమాను ఒప్పుకున్నాను అని రాజమౌళికే స్వయంగా చెప్పుకొచ్చిందట.. ఈ విషయాన్ని స్వయాన రాజమౌళి ఈవెంట్లో బయటపెట్టాడు . దీంతో నా కథకు అస్సలు అనుష్క వాల్యూ ఇవ్వలేదని ..ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చిందని ఫన్నీగా కామెంట్స్ చేశారు”.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news