Newsపెళ్లిసంద‌డి హీరోయిన్ ర‌వ‌ళి కెరీర్ నాశ‌నం చేసింది ఎవ‌రు... ఆమెపై ప‌నిగ‌ట్టుకుని...

పెళ్లిసంద‌డి హీరోయిన్ ర‌వ‌ళి కెరీర్ నాశ‌నం చేసింది ఎవ‌రు… ఆమెపై ప‌నిగ‌ట్టుకుని చెత్త ప్ర‌చారం..!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినీ తారలు మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగే స్కోప్ ఉన్నా కూడా సడన్గా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. మరి కొందరు మాత్రం సినిమాలలో నటిస్తూ హీరోయిన్ ఛాన్స్‌లు తగ్గిపోయాక క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవతారం ఎత్తి అత్త, అమ్మ, ఆంటీ పాత్రలు చేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రవళి.

రవళి తెలుగు అమ్మాయి.. ఆమె స్వస్థలం ఏపీలోని విజయవాడ కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాలో ఈమె నటన అద్భుతం. ఆ తర్వాత ఆమె తెలుగులో స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. అప్పట్లో రవళికి కావలసిన అందంతో పాటు చక్కటి అభినయం కూడా ఉండేది. దీనికి తోడు తెలుగు అమ్మాయి కావడంతో కచ్చితంగా స్టార్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే సడన్గా రవళి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయింది.

ఆమె తల్లి విజయ దుర్గ తన తాజా ఇంటర్వ్యూలో తన ఇద్దరు పిల్లలు రవళి- హరిత గురించి తెలిపారు తమ స్వస్థలం కృష్ణా జిల్లాలోని గుడివాడ అని.. ఒకసారి చెన్నైలో దసరా నవరాత్రుల కోసం వెళ్లి అక్కడ వాతావరణం నచ్చడంతో తన ఇద్దరు పిల్లలతో పాటు అక్కడకే షిఫ్ట్ అయ్యానని తెలిపారు. అక్కడికి వెళ్లిన తర్వాత 4 నెలలకే తనకు సినిమా అవకాశాలు వచ్చాయని.. తాను తెలుగు, తమిళంలో 30 పైగా సినిమాలలో నటించానని తెలిపారు.

అప్పటికే ఇండస్ట్రీలో ఒక కనకదుర్గ ఉండడంతో తన పేరు విజయదుర్గగా మార్చారని.. ఇక తన పెద్ద కుమార్తె హరిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆమె చాలా పొట్టిగా ఉందన్న కారణంతో సైడ్ క్యారెక్టర్లు ఇచ్చేవారని.. హరిత బుల్లితెరపై సక్సెస్ అయిందని విజయదుర్గ వెల్లడించారు. ఇక‌ రెండో కూతురు రవళికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చిందని స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించిందన్నారు.

అయితే రవళి నల్లగా ఉంటుందని ఆమె బాగా లావు అయిపోయారు అన్న ప్రచారం గట్టిగా చేశారని. దీంతో ఆమెకు అవకాశాలు రాలేదని కావాలని కొందరు పనిగట్టుకుని.. ఈ ప్రచారం చేయడంతో రవళికి మరికొన్ని సినిమా ఛాన్స్‌లు ఉన్న ఇండస్ట్రీ పూర్తిగా దూరం పెట్టేసిందని వాపోయారు. అయితే రవళి పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news