Moviesఆషూ రెడ్డి చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అయిన వేణు స్వామి.....

ఆషూ రెడ్డి చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అయిన వేణు స్వామి.. ఇంప్రెస్స్ అయ్యి ఏం చేశాడో చూడండి (వీడియో)

వేణు స్వామి .. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించేసుకున్నాడు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీల జీవితాల్లో ఏం జరగబోతుందో అన్న విషయాలను ముందే చెప్పేస్తున్నా వేణు స్వామి అటు సినిమాలు పరంగా ఇటు పొలిటికల్ పరంగా చెప్పింది చెప్పినట్లు జరుగుతూ ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .

కొంతమంది హీరోయిన్స్ లైఫ్ టర్న్ అవ్వాలని ఆయనతో పూజలు కూడా చేయించుకున్నారు . అయితే తాజాగా ఆషూ రెడ్డి – వేణు స్వామి తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఆషూ రెడ్డి బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా రేంజ్ రోవర్ కారు కొనింది. చేతిలో పెద్ద ఆఫర్స్ లేకపోయినా ఆషూ రెడ్డికి అంత డబ్బులు ఎలా వచ్చాయి అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

ఆ విషయం పక్కన పెడితే ఇష్టమైన కారు కొనడంతో ఆషూ రెడ్డి తాను బాగా నమ్మే వేణు స్వామి దగ్గరికి వెళ్లి పూజ చేయించుకునింది . ఈ క్రమంలోనే ఆయన ఆషూ రెడ్డి రేంజ్ రోవర్ కార్ కు పూజ చేసిన వీడియో వైరల్ గా మారింది . టెంకాయ కొట్టిన అనంతరం ఆషూరెడ్డి ఆయన పాదాలకు మొక్కి నమస్కరించింది . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే “మనల్ని నమ్మి మన పద్ధతులను అనుసరించేవారు ఇలా బాగుపడినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది” అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో ఇదే వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news