Newsఈ యేడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిదిదే... ' మ్యాడ్...

ఈ యేడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిదిదే… ‘ మ్యాడ్ ‘ లాభం ఎన్ని రెట్లో తెలుసా..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ న‌టించిన సినిమా మ్యాడ్‌. గ‌త నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబ‌డి.. లాభాల ప‌రంగా చూస్తే ఈ యేడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది. నార్నే నవీన్, సంగీత శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియా, ఆనంతిక, గోపిక ఉదయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాలేజ్ యాక్ష‌న్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది.

యువ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్ క్రియేట్ చేసిన కామెడీ, యూత్‌ను టార్గెట్ చేస్తూ ఆక‌ట్టుకునేలా రాసుకున్న పంచ్ డైలాగులు థియేట‌ర్ల‌లో ఆడియెన్స్‌ను అల‌రించాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద స‌క్సెస్ కొట్టింది. మ్యాడ్ మూవీ కేవ‌లం రు 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓవ‌రాల్‌గా రు. 25 కోట్ల గ్రాస్‌తో పాటు రు. 12 కోట్ల‌కు పైగా షేర్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు ఐదింత‌ల లాభాలు వ‌చ్చేలా చేసింది.

పెట్టిన పెట్టుబ‌డి.. ఈ సినిమాకు జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోల్చి చూస్తే ఈ యేడాది మ్యాడ్ సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అని చెప్పాలి. మ్యాడ్ మూవీలో డైరెక్ట‌ర్ కేవీ అనుదీప్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌గా… భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించాడు. థియేట‌ర్ల‌లో సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీ లోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 3న ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news