News' లియో ' ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది... బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌రే... ర‌న్...

‘ లియో ‘ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది… బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌రే… ర‌న్ టైం ఎంతంటే..?

కోలీవుడ్ ఇళయ దళపతి స్టార్ హీరో విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా యువ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా లియో. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు, టీజర్లు, ట్రైలర్ కూడా అంచనాలు మరింతగా పెంచేశాయి. అక్టోబర్ 19న గ్రాండ్ గా లియో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.

బాలీవుడ్ నటుడు సంజయ్ ద‌త్‌, కోలీవుడ్ సీనియర్ యాక్టర్ అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని సెవన్ స్క్రీన్ స్టూడియో గ్రాండ్గా నిర్మించింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుంచి యు / ఏ సర్టిఫికెట్స్ సొంతం చేసుకున్న లియో రన్ టైం 164 నిమిషాలుగా ఫిక్స్ చేశారు లోకేష్ కనగరాజ్‌. ఇక ఈయన సినిమాలు అన్ని దాదాపు 170 నిమిషాలకు కాస్త అటు ఇటుగా ఉంటాయి. అయితే లియో ఆరు నిమిషాలు తక్కువగా 164 నిమిషాల‌ రన్ టైం తో ప్రేక్షకులు ముందుకు వస్తోంది.

అనిరుధ్‌ సంగీతం అందించిన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండియా మూవీ లవర్స్ అంతా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్న లియో సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ లియో ఎలా ? ఉండబోతుందో చెప్పేసాడు. అనిరుధ్ తాను వర్క్ చేసే సినిమాల విషయంలో ఒక అలవాటు పెట్టుకున్నాడు.. తాను సినిమా చూసి సోషల్ మీడియాలో జస్ట్ టైటిల్ తో కొన్ని ఫైర్ ఎమోజిస్ పెడతాడు.

అనిరుధ్ అలాంటి ఎమోజీలు పెట్టాడు అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతోంది అని అర్థం. గతంలో జైలర్ , జవాన్ సినిమాలకు కూడా అనిరుధ్ చేసిన ఎమోజీలు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు లియో సినిమా విషయంలో అనిరుధ్‌ తన రెస్పాన్స్ ఎమోజీ లతో పోస్ట్ చేయడంతో ఇది కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు ఫిక్స్ అయిపోయారు. అక్టోబర్ 19న లియో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news