Moviesఅందరి ముందే ఇంద్రజను అలాంటి మాట అనేసిన కృష్ణ భగవాన్.. లేడీస్...

అందరి ముందే ఇంద్రజను అలాంటి మాట అనేసిన కృష్ణ భగవాన్.. లేడీస్ పరువు తీసేశాడుగా(వీడియో)..!!

బుల్లితెరపై ఎన్ని షో స్ వచ్చినా సరే జబర్దస్త్ జబర్దస్త్ షో ను ఏ షో ఢీకొట్టలేక పోతుంది . వల్గర్ పంచెస్ డబల్ మీనింగ్ డైలాగ్స్ ..మాటకు ముందు ఓ బూతు పదం మాటకు తర్వాత మరో బూతు పదం ఇలా షోను నెట్టుకొస్తున్నారు కమెడియన్స్ . కాగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో లో ఇంద్రజను హర్ట్ చేసే విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు కృష్ణ భగవాన్ అంటూ జనాలు మండిపడుతున్నారు . కాగా లేటెస్ట్ ప్రోమో చూస్తే ఎప్పటిలాగే వచ్చిరాని డైలాగులతో కుళ్ళు జోకులతో నవ్వించడానికి ట్రై చేస్తారు .

స్కిట్లో భాగంగా నరేష్ నూకరాజు కలిసి లేడీ గెటప్ వేసుకొని వస్తారు . ఇందులో నైటీ వేసుకుని వస్తాడు నరేష్ .. ఇంద్రజ వదిన నైటీలో ఉన్న కంఫర్ట్ చీరలు అస్సలు ఉండదు అంటూ నాటి నాటి డైలాగ్స్ చేస్తాడు . నైటీ వేసుకుంటే ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉంటుందో అంటూ తన బాడీ లాంగ్వేజ్ లో చెప్పుకొస్తాడు. దీనికి ఇంకాస్త పొడిగించి ఎంత ఫ్రీగా ఉంటుందో అంటూ కూడా ద్వంద అర్థం వచ్చేలా డైలాగ్ చెప్తాడు. ఈ స్కీట్ అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు నైటీ గొడవ మానలేదు.

నైటీపై పలు విదాలుగా కామెంట్ చేస్తున్న తరుణంలో మా అందాలు అలా చూపించడం ఇష్టం లేక మేము నైటీలు వేసుకుంటున్నాం అంటూ.. దాంతో తప్పేంటి అంటూ ఇంద్రజ ప్రశ్నిస్తుంది . దీంతో పక్కనే ఉన్న కృష్ణ భగవాన్ సూపర్ కౌంటర్ ఇస్తూ వెరీ గుడ్ .. రేపటి నుంచి ఇంద్రజ కూడా నైటీ వేసుకుని వస్తారు షోకి అంటూ కౌంటర్ వేస్తాడు .దీంతో ఒక్కసారిగా ఇంద్రజ షాక్ అయిపోతుంది . అయితే ఇది ఆడవాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడాడు కృష్ణ భగవాన్ అంటూ పలువులు మహిళలు ఫైర్ అవుతున్నారు . మహిళలకు ఆయన సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news