News' మ్యాడ్ ' డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ శంక‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఎక్క‌డ...

‘ మ్యాడ్ ‘ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ శంక‌ర్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే.. ఎక్క‌డ నుంచి ఎలా ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడంటే..!

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అయిన సినిమా మ్యాడ్. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతోంది. సాయి సౌజన్య – సూర్యదేవర హారిక ఈ సినిమాకు నిర్మాతలుxe వ్యవహరించారు. సినిమా యూత్ కు కనెక్ట్ అవడంతో పాటు రోజుకి బజ్ పెంచుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఒక్కసారిగా ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో దర్శకుడు కళ్యాణ శంకర్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది.

కళ్యాణ్ శంకర్ విద్యాభ్యాసం అంత స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో కొనసాగింది. అక్కడ తెలుగు మీడియం లోనే చదువుకున్నాడు. అక్కడ నుంచి ఇక్కడదాకా రావడానికి తనకు ఇద్దరు వ్యక్తులు ఇన్స్పిరేషన్ అని కళ్యాణ్ శంకర్ తెలియజేయడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరే తాను ఇండస్ట్రీలోకి రావడానికి స్ఫూర్తి అని కళ్యాణ్ చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ లోని కళ్యాణ్ పేరు నా పేరులో పెట్టుకున్నా… త్రివిక్రమ్ గారి పేరు నా గుండెల్లో పెట్టుకొని పెన్నుతో పేపర్ మీద రాయటం మొదలుపెట్టాను. ఆ ఇద్దరు స్ఫూర్తితో ఇలా వచ్చాను.. మ్యాడ్ లాంటి సినిమా రావడానికి జాతి రత్నాలు సినిమా పునాది.. ఇక నాగ వంశీ అన్ననే కలవడం నా లైఫ్ లో గొప్ప మార్పులు తీసుకువచ్చిందని.. మ్యాడ్ సినిమాతో నాతోపాటు 40 మందికి లైఫ్ మారిపోయిందని కళ్యాణ్ శంకర్ ఉద్వేగంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఒక్క సినిమాతో కళ్యాణ్ శంకర్ టాలీవుడ్ లో సెన్సేషనల్ అయిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news