Newsబాల‌య్య ' భ‌గ‌వంత్ కేస‌రి ' లో పాప సెంటిమెంట్‌... అదిరిపోయే...

బాల‌య్య ‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ లో పాప సెంటిమెంట్‌… అదిరిపోయే ట్విస్ట్ ఇది…!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ యాడాది సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అంతకుముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన అఖండ సినిమా కూడా బాలయ్య కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా భగవంత్‌ కేసరి. ఈ సినిమాపై టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి అంచనాలు మామూలుగా లేవు.

దీనికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌, స్టిల్స్ అయితే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసాయి. టీజ‌ర్‌లో బాలయ్య నేలకొండ భగవంత్‌ కేసరి ఈ పేరు చానా ఏళ్లు యాది ఉంటది అని చెప్పడంతోనే సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో చెప్పకనే చెప్పేసారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆర్ఆర్ వ‌ర్క్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దసరా కానుకగా ఈనెల 19న భగవంత్‌ కేసరి ప్రేక్షకులు ముందుకు వస్తోంది.

బాలయ్యకు జోడిగా సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ ఆల్రెడీ ఓ సాంగ్ లాంచ్ చేశారు. ఇప్పుడు రెండో సాంగ్ లాంచ్ చేస్తున్నట్టు కన్ఫామ్ చేశారు. ఉయ్యాలో ఉయ్యాల అంటూ సాగే ఈ సాంగ్ పై ఓ బ్యూటిఫుల్ పోస్టర్‌ను ఇప్పుడు లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య పక్కన ఒక చిన్నారి కనిపిస్తున్నారు. ఈ సాంగ్ ఈనెల 4న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

ఉయ్యాలో ఉయ్యాలో అంటూ ఈ పాట పల్లవి ఉండడంతో పాటు రిలీజ్ చేసిన పాస్టర్లో బాలయ్య పక్కన చిన్నారి కూడా ఉండడంతో ఈ సినిమాలో కూతురు సెంటిమెంట్ తో పాటు పాప సెంటిమెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య కొన్నాల క్రితం నటించిన జై సింహా సినిమాలోను పాప సెంటిమెంట్ ఉంది. అయితే ఈసారి రకరకాల సెంటిమెంట్లతో పాటు ఎమోషన్లు, యాక్షన్‌తో పాటు ఇప్పుడు అనిల్‌ మార్క్ కామెడీ ఇవన్నీ కల‌గలిపి భగవంత్‌ కేసరి సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. బాలయ్యను ఇప్పటివరకు కెరియర్ లో ఏ దర్శకుడు చూపించ‌ని విధంగా సరికొత్తగా అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెర‌కెక్కుతున్నా ఈ సినిమా రూ.100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news