Newsకొత్త మొగుడి కోసం నిహారిక న్యూ అవతారం.. మెగా డాటర్ లో...

కొత్త మొగుడి కోసం నిహారిక న్యూ అవతారం.. మెగా డాటర్ లో మస్తు షేడ్స్‌ ఉన్నాయే…!

మెగా డాటర్ నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యలతో విడాకులు తీసుకున్నాక మరింత రెచ్చిపోతున్నట్టుగా ఉంది. ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో వరుసగా హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. తన స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ప్ర‌స్తుతం నిహారిక త‌న అన్న వ‌రుణ్‌తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ప‌నుల్లో కూడా బిజీగా ఉంది.

ఇక సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటూ హీరోయిన్లను మించి హాట్ షో చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. రెండు రోజుల క్రితం డార్క్ యాంగిల్లో బాగా హాట్‌గా రెచ్చిపోయిన నిహారిక ఫొటోలు చూసి నెటిజ‌న్లు మాత్ర‌మే కాదు.. మెగాభిమానులు కూడా నిహారిక‌ను దారుణంగా తిట్టిపోశారు. తాజాగా నిహారిక చీరకట్టులో ఉండి బ్రహ్మచారిని పూజ చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దివ్య‌జ్ఞానం పొందే ప్రయత్నం చేస్తుంది.. అందుకు బ్రహ్మచారిని దేవత పూజలో బిజీగా ఉంది.. తెల్ల చీర కట్టుకుని నీట కొల‌నులో మునుగుతుంది.. పుణ్యం ఆచరిస్తూ పూజలు నిర్వహించింది.. అంతకుముందు సాధువులా మారి షాక్ ఇచ్చింది అని నెటిజన్లు ఆమె ఫోటోలకు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాయి.

ఏదేమైనా మెగాడాట‌ర్‌లో మ‌స్తే షేడ్స్ అయితే ఉన్నాయి. ఆమె పూర్తిగా తెగించేసిన‌ట్టుగా ఉంది. ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గే ప్ర‌శ‌క్తే లేదన్న‌ట్టుగా ఉంది. మ‌రి నిహారిక య‌వ్వారం ఎన్ని రోజులు కొన‌సాగుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news