Newsమ‌హేష్ vs వెంక‌టేష్ vs ర‌వితేజ vs విజ‌య్ దేవ‌ర‌కొండ‌... గెలిచేదెవ‌రు.....

మ‌హేష్ vs వెంక‌టేష్ vs ర‌వితేజ vs విజ‌య్ దేవ‌ర‌కొండ‌… గెలిచేదెవ‌రు.. ఓడేదెవ‌రు..!

టాలీవుడ్ లో సంక్రాంతికి రెండు.. మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే థియేటర్ల కోసం గొడవలు.. ఇటు అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. అందులో చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎంత పెద్ద హంగామా ? నడుస్తుందో చూస్తూనే ఉంటాం. అయితే ఒకేసారి రెండు మూడు పెద్ద హీరోల సినిమాలు థియేటర్లకు వచ్చి హిట్ అయిన సందర్భాలు చూస్తున్నాం. అయితే వచ్చే సంక్రాంతికి ఏకంగా ఐదు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

ఇందులో ఎవరు ముందుకు వస్తారో ? ఎవరు వెనక్కి తగ్గుతారో తెలియటం లేదు గాని ప్రస్తుతానికి ఎవరికి వారు తాము సంక్రాంతి బరిలో ఉంటామని చెబుతున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం ఇప్పటికే సంక్రాంతి ఫిక్స్ అయింది. ఆ మరుసటి రోజు వెంకటేష్ సైంధవ్ – రవితేజ ఈగిల్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది.

వీటితోపాటు యువ హీరో తేజ స‌జ్జ‌ నటిస్తున్న హనుమాన్ కూడా సంక్రాంతి రేసులో ఉంది. అయితే హనుమాన్ ఈ రేసు నుంచి తప్పుకుంటుందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. నాగార్జున నా సామిరంగా సినిమా కూడా సంక్రాంతికి అంటున్నా ఇంత గట్టి పోటీ మధ్యలో రిలీజ్ అవుతుందా ? అన్న సందేహాలే ఉన్నాయి.

ప్రస్తుతానికైతే మహేష్ బాబు గుంటూరు కారం – వెంకటేష్ సైంధవ్ – రవితేజ ఈగిల్ – విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాలు కచ్చితంగా సంక్రాంతి రేసులో ఉండనున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల పోటీలో ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడతారు.. ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ విన్నర్ ఎవరు అన్నది ? కాలమే నిర్ణయించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news