Newsమోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ టైటిల్స్ ఏంటో చెప్పేసిన బాల‌య్య‌... బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్...

మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ టైటిల్స్ ఏంటో చెప్పేసిన బాల‌య్య‌… బ్లాక్‌బ‌స్ట‌ర్ టైటిల్ ఫిక్స్‌..!

నందమూరి వంశంలో మూడో తరం హీరోగా నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టైమ్ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క‌థ‌లు కథలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య ఎనిమిది సినిమాలలో నటించేశాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య 109వ సినిమా చేస్తున్నా కూడా ఇంకా మోక్షజ్ఞ వెండి తెరంగ్రేటం జరగలేదు.

ఆ మధ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందని ప్రకటించారు. తాజాగా మరోసారి బాలయ్య తన వారసుడు మోక్షజ్ఞ సినిమా అరంగ్రేయటం గురించి ఓపెన్ అయ్యారు. భగవంత్ కేస‌రి సినిమా ప్రమోషన్లలో బాలయ్య తో హీరోయిన్ శ్రీలీల‌.. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని అడిగింది. దానికి స్పందిస్తూ వచ్చే ఏడాది మోక్షజ్ఞ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

అలాగే బాలయ్య కథ గురించి కూడా మాట్లాడుతూ.. నేను రాసిన ఆదిత్య 999 మాక్స్ కథ‌ ఒకటి ఉంది.. ఈ కథను నేను ఒక రాత్రిలో రాసేసాను.. అలాగే ఇంకొక క‌థ‌ కూడా ఉంది.. మరికొన్ని కథలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఏ కథతో మోక్షజ్ఞ మొదటి సినిమా తెరకెక్కుతుంది అనేది తాను ఇప్పుడే చెప్పలేనని బాలయ్య చెప్పారు.

తప్పకుండా వచ్చే యేడాది వాడు హీరోగా వస్తాడు అని మాత్రం బాలయ్య క్లారిటీ ఇచ్చేశాడు. తన కొడుకు సినిమాకు దర్శకుడు ఎవరనేది ? మాత్రం బాలయ్య రివీల్ చేయలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం మోక్షజ్ఞ మాత్రం హీరో అయ్యేందుకు రకరకాల కసరత్తులు.. రకరకాల మెళ‌కువలు నేర్చుకునే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news