Newsబాల‌య్య ' అన్‌స్టాప‌బుల్ 3 ' కు క్రేజీ సెల‌బ్రిటీలు... లిస్ట్‌లో...

బాల‌య్య ‘ అన్‌స్టాప‌బుల్ 3 ‘ కు క్రేజీ సెల‌బ్రిటీలు… లిస్ట్‌లో వీళ్లే…!

బాలయ్య హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌లో ఇప్పటికే రెండు సీజన్లు గడిచాయి. మూడో సీజన్ దసరా నుంచి ప్రారంభం కానుంది. తొలి సీజన్ దుమ్మురేపేసింది. బాలయ్య బుల్లితెరపై బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ క్రేజ్ బాలయ్యను తీసుకువెళ్లి టాలీవుడ్లో శిఖరాగ్రాన‌ నిలబెట్టేసింది. రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అయినా.. తొలి సీజన్తో పోలిస్తే కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం రెండో సీజన్‌కు సరైన సెలబ్రిటీలు దొరకలేదు. ఇప్పుడు మూడో సీజన్ వచ్చేసింది. మూడో సీజన్ కూడా గెస్ట్ ల సమస్య ఉంది.

బాలయ్య అంటే ఓ లెవెల్ వాళ్లే కావాలి. మెగాస్టార్ ను తీసుకువద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మోకాలిక శాస్త్ర చికిత్స చేసుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. అందువల్ల మెగాస్టార్ – బాలయ్య ఎపిసోడ్ ఇప్పట్లో సాధ్యం కాదు. నాగార్జున, ఎన్టీఆర్ తో బాలయ్య షో ఉంటుందని ఆశించలేం. అయితే కళ్యాణ్ రామ్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలి ఎపిసోడ్ దసరా కానుకగా భగవంత్‌ కేసరి టీంతో ఉంటుందని.. ఇది ఇంటర్వ్యూ కింద నడిచిపోతుందని తెలుస్తోంది.

రెండో ఎపిసోడ్ లో అల్లుఅరవింద్ ఫ్యామిలీ రావచ్చని తెలుస్తోంది. అల్లు అరవింద్ కుటుంబంతో పాటు అల్లు శిరీష్.. అరవింద్ మరో కుమారుడు ఉండొచ్చు.. అయితే ఇందులో బన్నీ ఫ్యామిలీ ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక మూడో ఎపిసోడ్ కోసం టాప్ సెలబ్రిటీగా తెలంగాణ మంత్రి కేటీఆర్ తో చర్చలు జరుగుతున్నాయి. ఆహా నుంచి కేటీఆర్ ను ఎవరో అప్రోచ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం కేటీఆర్ ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఆయన ఓకే చెబుతారా లేదా అన్నది చెప్పలేం. మధ్యలో కళ్యాణ్‌రామ్ ఎపిసోడ్ కూడా ఉండేలా ఉంది. ఏది ఏమైనా మూడో సీజన్లో సింపుల్గా ఐదు ఎపిసోడ్లతోనే ముగించేస్తారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news