Newsహీరోయిన్‌తో బుగ్గ కొరికించుకుంటూ సుమ కొడుకు రొమాన్స్ ర‌చ్చ ( వీడియో)..!

హీరోయిన్‌తో బుగ్గ కొరికించుకుంటూ సుమ కొడుకు రొమాన్స్ ర‌చ్చ ( వీడియో)..!

ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. రోషన్ హీరోగా నటించిన తొలి సినిమా బబుల్ గమ్. క్షణం సినిమా దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈశ్వరి మూవీస్ – పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రేమ అనేది బబుల్‌గ‌మ్‌ లాంటిదని.. ముందు తియ్యగా ఉన్న ఆ తర్వాత అంటుకుంటుందంటూ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ను పబ్‌లో చూసి హీరో ప్రేమలో పడటం.. ఆ తర్వాత హీరో గురించి హీరోయిన్ కి నిజం తెలిసి గొడవపడటం ఇందులో చూపించారు. స‌ముద్రం ఒడ్డున హీరో, హీరోయిన్ లిప్‌లాక్ సీన్‌తో బ‌బుల్‌గ‌మ్ సినిమా టీజర్ ముగిసింది.

టీజర్ చూస్తుంటే లవ్, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలతో యూత్ ఫుల్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఏది ఏమైనా యాంకర్ సుమ చాలా సాంప్రదాయంగా ఉంటారు. జయమ్మ పంచాయతీ సినిమాలో ఆమె నటించిన ఎక్కడ బోర్డర్ దాటలేదు.

ఇక సుమ తనయుడు తొలి సినిమాతోనే రొమాన్స్ విషయంలో రచ్చ రంబోలా చేస్తున్నాడు. హీరోయిన్‌తో బుగ్గలు కొరిపించుకోవడం.. ఘాటుగా హాటుగా వాటేసుకుని రొమాన్స్ చేయటం చూస్తుంటే ఈ సినిమాలో రొమాన్స్‌కు ఏమాత్రం కొదవలేదని తెలుస్తోంది. డిసెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news