Newsబాల‌య్య ' స‌మ‌ర‌సింహారెడ్డి 2 ' వ‌స్తోంది.. చిన్న ట్విస్ట్ ఇదే..!

బాల‌య్య ‘ స‌మ‌ర‌సింహారెడ్డి 2 ‘ వ‌స్తోంది.. చిన్న ట్విస్ట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం ఎంతలా స్వింగ్ అవుతుందో చూస్తూనే ఉన్నాము. బాలయ్య పట్టిందల్లా బంగారం అవుతుంది. బాలయ్య ఏ సినిమాలో నటించిన వర‌స‌పెట్టి సూపర్‌హిట్‌లు కొడుతున్నారు. బాలయ్య కెరీర్‌లో సమరసింహా రెడ్డికి ఎంతో క్రేజ్ ? ఉంది. బాలయ్య మార్కెట్ ఒక్కసారిగా పెరగడంతో పాటు బాలయ్య పని అయిపోయిందన్న విమర్శలకు చెక్ పెట్టి పదేళ్లపాటు బాలయ్య కెరీర్‌కు తిరుగులేకుండా చేసిన సినిమా సమరసింహారెడ్డి.

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా చరిత్ర రికార్డులను తిరగా రాసి.. 77 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. 30కి పైగా కేంద్రాలలో 175 రోజులు పూర్తి చేసుకుంది. మరెన్నో కేంద్రాలలో 200 రోజులు కూడా ఆడింది. రాయలసీమలో అయితే ఏకంగా సంవత్సరం పాటు ఆడింది. ఈ సినిమాతోనే తెలుగు సినిమా చరిత్రలో రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ ప్రారంభమైంది.

ఇది కంప్లీట్ యాక్షన్ డ్రామా కాదు.. సెంటిమెంట్ ఎమోషనల్ డ్రామా కూడా ఇమిడి ఉంది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు సమరసింహారెడ్డి బాగా కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత బాలయ్య మళ్ళీ సమరసింహారెడ్డి టైప్‌ రాయలసీమ యాక్షన్, ఫ్యామిలీఎమోషనల్ డ్రామా కలగలిపిన సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏదో కాదు బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న బాబి సినిమా.

సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన‌ సినిమా స్టోరీ కూడా సమరసింహారెడ్డి టైపులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కూడా బాలయ్య డివిజన్ రోల్‌లో కనిపించబోతున్నాడు. వచ్చేయేడాది ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news