Movies"ప్రేమలో ఉన్నా లేకపోయినా నేను అలా చేస్తాను".. బన్నీ భార్య పోస్ట్...

“ప్రేమలో ఉన్నా లేకపోయినా నేను అలా చేస్తాను”.. బన్నీ భార్య పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సరే దానికి దందార్థాలు తీయ్యడం ఎక్కువగా ఫాలో అవుతున్నారు జనాలు . మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ ఏ పోస్ట్ పెట్టిన దానికి డబుల్ మీనింగ్ అర్ధాలు బయటికి తవ్వుతూ సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తున్నారు . తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి పెట్టిన పోస్ట్లు అభిమానులు అదేవిధంగా ద్వందఅర్థంతో చేస్తున్నారు . కాగా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే స్నేహ రెడ్డి ఎలాంటి ఫోటో షేర్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

హీరోయిన్స్ కి మించిపోయే రేంజ్ లో అందాలను వలకబోసే స్నేహ రెడ్డి తాజాగా తన ఇన్స్టా స్టోరీ లో ఒక పిక్ని షేర్ చేసింది . ఈ పిక్ లో ని కొటేషన్ ప్రకారం “తాను ప్రేమలో ఉన్న లేకపోయినా కూడా శాంపెన్ తాగుతాను” అంటూ షేర్ చేసింది. ఈ కొటేషన్స్ స్నేహ రెడ్డి ఎందుకు షేర్ చేసిందో తెలియదు కానీ …

సోషల్ మీడియాలో మాత్రం ఆమెను ఏకేస్తున్నారు . అంటే నువ్వు ప్రేమలో ఉన్నా లేకపోయినా కూడా తాగుతావా ..? ఇది నీ లైఫ్ లో కూడా వర్తిస్తుందా ..?అంటూ ప్రశ్నిస్తుంటే .. మరికొందరు ఆమె ఏదో సరదాగా పెట్టిన పోస్ట్ ని ఇంత సీరియస్గా తీసుకోవాలా అంటూ బన్నీ ఫాన్స్ రీకౌంటర్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news