News' అఖండ 2 ' ముహూర్తం ఫిక్స్‌... అప్ప‌ట్నుంచే మొద‌లు... క‌థ...

‘ అఖండ 2 ‘ ముహూర్తం ఫిక్స్‌… అప్ప‌ట్నుంచే మొద‌లు… క‌థ లెక్క ఇదే…!

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్ అయ్యాయి. సింహ – లెజెండ్ – అఖండ ఈ మూడు ఒకదాన్ని మించి ఒకటి సూప‌ర్‌ హిట్ అవ్వడంతో పాటు.. బాలయ్య కెరీర్ కాస్త డల్ అవుతుంది అనుకుంటున్న టైంలో వచ్చి బాలయ్య కేరీర్‌ను శిఖరాగ్రాన‌ నిలబెట్టాయి.

అఖండ సూపర్ హిట్ అయ్యాక అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? లాంటి విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా బోయపాటి.. రామ్ హీరోగా తరకే కించన స్కంద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఇక స్కంద రిలీజ్ అవ్వడంతో బోయపాటి శీను అఖండ 2 స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని.. జనవరిలో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ కథలో సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని బాలయ్య నుంచి మనం మరో సరికొత్త సినిమా చూడబోతున్నామని తెలుస్తోంది. ఇటు సోషియో ఫాంటసీ కథతో పాటు బోయపాటి మార్క్‌ యాక్షన్ సీన్లు.. పొలిటికల్ పంచ్‌లు.. బాలయ్య మార్కు యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన భగవంత్‌ కేసరి సినిమా ఈ నెల 19న రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news