News' పెద్ద‌కాపు 1 ' సినిమా ప్రిమియ‌ర్ టాక్‌.... బొమ్మ హిట్టు...!

‘ పెద్ద‌కాపు 1 ‘ సినిమా ప్రిమియ‌ర్ టాక్‌…. బొమ్మ హిట్టు…!

విరాట్ కర్రా మరియు ప్రగతి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పెద్ద కాపు 1. బ్ర‌హ్మోత్స‌వం లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత వెంకీతో నార‌ప్ప సినిమా చేసి హిట్ కొట్టిన శ్రీకాంత్ తాజాగా పెద్ద కాపు 1 సినిమా చేశాడు. సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో మంచి హైప్ వ‌చ్చింది. ఈ సినిమా అటు బోయ‌పాటి – రామ్ స్కంద‌తో పాటు చంద్ర‌ముఖి 2 సినిమాల‌కు పోటీగా రిలీజ్ అవుతోంది.

రేపు థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న ఈ సినిమాకు ప్రీమియ‌ర్ షోలు వేశారు. నిన్న రాత్రి వేసిన ప్రీమియ‌ర్ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు శ్రీకాంత్ టేకింగ్ బాగుంద‌ని.. ఖ‌చ్చితంగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌తో పాటు మాస్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంద‌ని అంటున్నారు.

ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ పెద్ద‌కాపు 1 సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా ఛోటా కె నాయుడు వ్య‌వ‌హ‌రించారు. అలాగే ఎడిటర్‌గా మార్తాండ్ కె వెంకటేష్, సమర్పకుడిగా మిర్యాల సత్యనారాయణ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news