Moviesమెగా ఫ్యామిలీలో జరిగే బ్యాడ్ పనులకు కారణం ఆ ఇళ్లేనా..? ఆ...

మెగా ఫ్యామిలీలో జరిగే బ్యాడ్ పనులకు కారణం ఆ ఇళ్లేనా..? ఆ ఇంటి వల్లే ఇన్ని దరిద్రాలా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఉన్నవి లేనివిగా ..చూపించడం లేనివి ఉన్నవిగా చూపించడం చాలా చాలా కామన్ గా మారిపోతుంది . మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ గురించి వైరల్ అవుతున్న వార్తలు మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం . రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీలు జరిగే బ్యాడ్ సెంటిమెంట్ అన్నిటికీ ఓ ఇల్లే కారణం అంటూ సరికొత్త న్యూస్ ట్రెండ్ అవుతుంది . మకుటం లేని మహారాజుగా ఇండస్ట్రిని ఏలేస్తున్న చిరంజీవి . గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నారు.

అంతేకాదు ఆయన తీసిన సినిమాలు కూడా జనాలను మెప్పించలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవిని ఇక సినిమాలు ఆపేయమంటూ కూడా సొంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే దీనంతటికీ కారణం చిరంజీవి టైం బాగోలేకపోవడమే అంటూ కొందరు ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. నిజానికి మొగల్తూరులో చిరంజీవి నివసించిన ఇల్లును అప్పట్లో లైబ్రరీకి ఇవ్వకుండా మెగాస్టార్ కేవలం 3 లక్షల రూపాయలకే అమ్మేశారట . అయితే అక్కడ లైబ్రరీ పెట్టడానికి చాలామంది ట్రై చేశారట . చిరంజీవి ముందు నుంచి ప్రజల గురించి ఆలోచిస్తారు అని తెలిసి ఆయన ఆ ఇల్లును ఇవ్వమని అడగ్గా ఆయన ఇవ్వను అంటూ తేల్చి చెప్పేసారట.

ఈ విషయం అప్పట్లో ఎంతో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే అసలు విషయం ఏంటంటే ఆ ఇల్లు చిరంజీవిది కాదు ..చిరంజీవి మేనమామ గారిది ..ఆ ఇంటి తో అసలు చిరంజీవికి ఎటువంటి హక్కు లేదు ..అయితే కావాలనే కొందరు చిరంజీవిని ఈ మేటర్ లో ఇన్వాల్వ్ చేసి ఇరికించారు . అయితే ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు చిరంజీవి ఇంట్లో వరుసగా బ్యాడ్ జరగడానికి కూడా అదే కారణమని ..అక్కడ లైబ్రరీకి ఇల్లు ఇవ్వకపోవడం చిరంజీవి ఒప్పుకోకపోవడంతోనే మెగా ఫ్యామిలీ ఇన్ని ఇబ్బందులు పడుతుందని శ్రీజ – నిహారిక విడాకుల విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ని అప్లై చేస్తున్నారు. దీంతో మెగా ఫాన్స్ ఫుల్ ఫైర్ అయిపోతున్నారు . అసలు ఆ ఇంటికి మెగాస్టార్ చిరంజీవికి సంబంధం ఏంటి ఎక్కడో మేటర్ ని ఎక్కడికో లింక్ పెడుతున్నారు..? ఇది సమంజసం కాదు..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news