Moviesవ‌ర‌ల్డ్‌వైడ్ ' జ‌వాన్ ' ఫ‌స్ట్ డే వ‌సూళ్లు… బాక్సాఫీస్ ఊచ‌కోత...

వ‌ర‌ల్డ్‌వైడ్ ‘ జ‌వాన్ ‘ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు… బాక్సాఫీస్ ఊచ‌కోత కోసేసిన షారుక్‌..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా షారుక్ ఖాన్ జవాన్. భారీ మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా సినిమాలో షారుక్ జోడిగా నయనతార – దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించారు. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే ఏకంగా అడ్వాన్స్ బుకింగ్‌ల‌తోనే రు. 50 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ ఈ ఏడాది నటించిన బ్లాక్ బస్టర్ పఠాన్ సినిమా రికార్డులను కూడా బీట్ చేసి పడేసింది. జవాన్ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా కని విని ఎరుగని రేంజ్ లో వసూళ్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. జవాన్ తొలిరోజు వరల్డ్ వైడ్ గా రు. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది అంటూ లేటెస్ట్ ప్రిడిక్షన్ అయితే వచ్చింది. కొద్దిసేపట్లోనే ఏరియాల వారిగా పూర్తి లెక్కలు బయటకు రానున్నాయి.

షారుక్ నుంచి మరో సెన్షేష‌న‌ల్‌ ఓపెనింగ్ ఇది అని చెప్పాలి. ఇక మొదటి రోజు కేవలం ఇండియాలోనే రు. 70 -75 కోట్ల రేంజ్‌లో నెట్ కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ ఎనలిస్ట్ మనోభాల వెల్లడించారు. ఇండియాలో బాలీవుడ్ సినిమాకి ఇదే అతిపెద్ద ఓపెనింగ్ అని కూడా ఆయన ట్విట్ చేశారు. ఓపెనింగ్ డే వంద కోట్లు సాధించిన రెండు సినిమాలు ఉన్న ఏకైక బాలీవుడ్ హీరోగా షారుక్‌ నిలిచాడ‌ని కూడా ఆయన పేర్కొన్నారు.

ఏదేమైనా షారుక్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోత‌కు రెడీ అయిపోయిన‌ట్టు జ‌వాన్ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు చెప్పేశాయి. ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో చాలా సినిమాల వ‌సూళ్ల‌ను బీట్ చేసేయ‌నుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news