Moviesవామ్మో..బేబీ మూవీ లో వైష్ణవిని పెళ్లి చేసుకున్న ఈ యాక్టర్ ఆ...

వామ్మో..బేబీ మూవీ లో వైష్ణవిని పెళ్లి చేసుకున్న ఈ యాక్టర్ ఆ స్టార్ డైరెక్టర్‌కి బ్రదరా..అంత తోపా..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హ్యూజ్ పాజిటివ్ టాక్ అందుకోవడమే కాకుండా కోట్లు లాభాలు తీసుకొస్తున్నాయి .అలాగే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమానే బేబీ . సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యింది. విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ తన ప్రేమించిన వాళ్ళిద్దరిని కాకుండా క్లైమాక్స్ లో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది . దీనిపై మనం రకరకాల మీమ్‌స్ కూడా చూసాం . విరాజ్ – ఆనంద్ వీళ్లైఇద్దరి లో ఏ అబ్బాయిలా అయినా ఉండొచ్చు కానీ ఆ లాస్ట్ లో పెళ్లి చేసుకున్న అబ్బాయి బ్రతుకు ఎవరికీ వద్దు అంటూ చాలా ఫన్నీగా మీమ్‌స్ క్రియేట్ చేశారు జనాలు . అయితే ఆ క్లైమాక్స్ సీన్ చాలా వైరల్ అయింది. బేబీ సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు బాగా వైరల్ అయిపోయాడు . దీంతో అతను ఎవరా..? అంటూ వెతికి ఆరాతీస్తున్నారు.

మొత్తానికి బేబీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరో తెలిసిపోయింది . అతని పేరు కృష్ణ మల్లిడి. ఇప్పటికే ఈయన చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించి మెప్పించారు. కలర్ ఫోటో సినిమాలో కూడా హీరోకి సీనియర్ క్యారెక్టర్ లో కనిపించి మంచి మార్కులు వేయించుకున్నాడు . ఎన్ని పాత్రలు చేసినా సరైనా బ్రేక్ మాత్రం రావడం లేదు. ఈయన మరెవరో కాదు బింబిసారా డైరెక్టర్ వశిష్టకు బ్రదర్ . ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు యాంకర్ విష్ణుప్రియకు ఇతడు దూరపు రిలేటివ్ కూడా అవుతారట. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news