Moviesనా కొడుకు డేట్లు కావాలంటే ఆ ప‌ని చేయాల్సిందే… నిర్మాత‌కు హీరో...

నా కొడుకు డేట్లు కావాలంటే ఆ ప‌ని చేయాల్సిందే… నిర్మాత‌కు హీరో విజ‌య్ తండ్రి కండీష‌న్లు..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన ఖుషి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో విజయ్ తన పారితోషకముం నుంచి కోటి రూపాయలను తన దేవర ఫ్యామిలీకి చెందిన 100 మందికి ఇస్తానని ప్రకటన చేయడంతో విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఊహించని విధంగా టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా విజయ్ దేవరకొండ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను పంపిణీ చేసిన అభిషేక్ తాను ఎనిమిది కోట్ల రూపాయలు నష్టపోయాన‌ని.. దయచేసి తమను కూడా ఆదుకోవాలని అభిషేక్ నామా చేసిన ట్వీట్ ఇండస్ట్రీ వర్గాల్లో హార్ట్ టాపిక్ గా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ టైం లో చాలా ఇబ్బందులు ఎదురవడంతో ఆ సినిమా నిర్మాత కె ఎస్ రామారావు చేతులు ఎత్తేసారట. దీంతో ఆసియన్ సునీల్ ఒక సినీ ఫైనాన్షియర్ ను కలిసి గ్యారంటీ సంతకం పెట్టి సినిమా రిలీజ్ అయ్యేలా చేశారని అభిషేక్ స్పష్టం చేశారు.

ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఎలా ? వ్యవహరించారో ఆ సినిమా నిర్మాత కె ఎస్ రామారావుకి మాత్రమే తెలుస‌ని కూడా అభిషేక్ నామా చెప్పుకొచ్చారు. ఆ సినిమా వల్ల తనకు ఎనిమిది కోట్ల రూపాయల నష్టం రావడంతో విజయ్ తండ్రిని కలిసి తమకో సినిమా చేసి పెట్టమని డేట్లు అడిగినట్టు కూడా అభిషేక్‌ తెలిపాడు. అప్పుడు విజయ్ తండ్రి సుకుమార్ – త్రివిక్రమతో సినిమాలు ప్లాన్ చేస్తే డేట్లు ఇస్తామని అన్నారని అభిషేక్ తెలిపారు.

ఏది ఏమైనా టాలీవుడ్ నిర్మాతలు హీరోలను వేరే లోకంలో ఉంచుతున్నారని.. హీరో సన్నిహితులు మాట్లాడిన మాటలు బాధ పెట్టడంతో తాను ఆ విధంగా ట్వీట్ చేయాల్సి వచ్చిందని కూడా అభిషేక్ నామ అన్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏమిటో ? అటు అభిషేక్ కు ఇటు విజయ్ దేవరకొండకు మాత్రమే తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news